Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 11 2016 @ 09:14AM

తమిళంలో హిట్‌ కోసం ‘శైలజ’ ఎదురు చూపులు

న్యూ ఇయర్‌ రోజు శైలజగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి తొలి హిట్‌ అందుకున్న మలయాళ భామ కీర్తి సురేష్‌. శైలజగా ఆమె ప్రదర్శించిన అభినయం, అందం ‘నేను..శైలజ’ చిత్రంతో టాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చిపెట్టింది. అయితే ముందుగా ఆమె నటిగా ఆరంగేట్రం చేసిన తమిళంలో మాత్రం హిట్‌ లేకపోవడం నిన్నటితరం హీరోయిన మేనక వారసురాలైన కీర్తిని బాధిస్తోంది. 2015లో ‘ఇదు ఎన్న మాయం’తో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన కీర్తికి ఆ చిత్రం నిరాశే మిగిల్చింది. అందుకే పొంగల్‌కి రాబోతున్న ‘రజనీ మురుగన్’పై భారీ ఆశలు పెట్టుకుంది. శివకార్తికేయన్ హీరోగా పొంగల్‌కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే వున్నాయి. కానీ, విడుదలలో జాప్యం యూనిట్‌ని ఆందోళనకు గురిచేస్తున్నా, పొంగల్‌ రేసులో బరిలోకి దిగడం శుభపరిమాణం. ఇదే పాజిటివ్‌ థింకింగ్‌తో న్యూ ఇయర్‌కి తెలుగులో అందుకున్న విజయాన్ని తమిళంలో పొంగల్‌కి అందుకోవాలని ఎదురుచూస్తోంది ‘శైలజ’..!