Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 11 2016 @ 03:21AM

అకాడమీ మూసెయ్‌!

  • అజ్మల్‌కు అధికారుల ఆదేశం
కరాచీ: క్రికెట్‌ అకాడమీ నడుపుతున్న పాకిస్థాన్‌ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. తన సొంత పట్టణం ఫైసలాబాద్‌లో క్రికెట్‌ అకాడమీ కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం నుం చి స్థలం తీసుకున్న అజ్మల్‌ శిక్షణార్ధులనుంచి భారీగా ఫీజులు వసూలుచేస్తున్నాడు. సుమా రు 350 మందిని చేర్చుకున్న అజ్మల్‌, ఒక్కొక్కరినుంచి 15వేల రూపాయల చొప్పున సుమారు 50 లక్షలదాకా వసూలు చేశాడని వర్సిటీ సిబ్బంది తెలిపారు. పైగా అకాడమీ వల్ల తమకు భద్రతా పరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని వారంటున్నారు. ఖాళీ చేయమని అడిగితే నిరాకరిస్తూ, స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. అయితే అజ్మల్‌ మాత్రం తమ మధ్య సమస్య సామరస్యంగా పరిష్కారమైందని చెబుతున్నాడు. కాగా 2014లో ఐసీసీ నిషేధం అనంతరం బౌలింగ్‌ యాక్షన్‌ను సవరించుకుని మళ్లీ గతేడాది ఏప్రిల్‌లో జాతీయ జట్టులోకి వచ్చినా అజ్మల్‌ మునుపటి స్థాయిలో రాణించలేకపోతున్నాడు.