Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 10 2016 @ 07:08AM

కోహెడ శివార్లలో పోలీస్‌ ఫైరింగ్‌ రేంజ్‌

  •  కోహెడ వద్ద ఏర్పాటుకు సన్నాహాలు 
  •  ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేయడంపై అభ్యంతరాలు 
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : నగర శివార్లలోని కోహెడలో హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 25 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీనికి స్థలం కేటాయించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. హయతనగర్‌ మండలం కోహెడలోని సర్వేనంబర్ల 581,582,585లోని 25 ఎకరాల్లో ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటుకు ఇటీవల అధికారులు స్థలాన్ని పరిశీలించారు. పూర్తిగా కొండఉన్న ఈ ప్రాంతం ఫైరింగ్‌ రేంజ్‌కు అనువుగా ఉంటుందని గుర్తించారు. ఎత్తైన ఈ ప్రాంతాన్ని కోహెడ గుట్ట అని స్థానికులు పిలుస్తారు. ఈ స్థలం పక్కనే మరికొంత ప్రభుత్వ స్థలం ఉండడంతో ఫైరింగ్‌ రేంజ్‌కు మరికొంత స్థలం కేటాయించాలని తాజాగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం 25 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇక్కడ ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఔటర్‌ రింగురోడ్డుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం రెసిడెన్షియల్‌ జోన్‌లో ఉందని ఇక్కడ ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే దీని పక్కనే ఔటర్‌ రింగురోడ్డు బాధితులకు ఇళ్లస్థలాలు కేటాయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఒక వేళ ఔటర్‌ బాధితులకు ఇక్కడ స్థలం కేటాయిస్తే తుపాకి చప్పుళ్లకు స్థానికలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.