Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 10 2016 @ 03:32AM

‘చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి’

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు
ఒంగోలు వ్యవసాయం/ మంగళగిరి, జనవరి 9 : రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌. కృష్ణారావు అభిప్రాయపడ్డారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫుడ్‌ 360 ఫౌండేషన, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా శనివారం నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.అందరికీ బియ్యం అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందే కానీ, చిరు ధాన్యాలను దూరం చేయడానికి కాదన్నారు.ఇకనుంచైన పౌరసరఫరాల సంస్థ ద్వారా ప్రజలకు సేంద్రియ పద్ధతుల్లో పండించిన చిరు ధాన్యాలను పేదలకు సరఫరా చేస్తే ఇటు వారికి పౌష్టికాహారం అందించడంతోపాటు, అటు రైతులకు కూడా ఆదరువుగా ఉంటుందన్నారు. ఫుడ్‌ 360 ఫౌండేషన్‌ చైర్మన్‌ పీఏ. చౌదరి మాట్లాడుతూ జొన్నలు, సజ్జలు, రాగులు, వరి, గోదుమలు, నువ్వులు, మినుములు, పెసర, అలసందలు, కందులు, శనగ, కొర్రల సాగు ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తులను సాధించవచ్చన్నారు.
 
ఉండవల్లి గుహలను సందర్శించిన ఐవైఆర్‌
ఉండవల్లి గుహలు రాబోయే రోజుల్లో అతిగొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందగలవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. ఒంగోలు నుంచి ఆయన విజయవాడ వెడుతూ ఉండవల్లి గుహలను సందర్శించారు. ఈ గుహాలయాలు రాజధాని ప్రాంతానికి ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయని అన్నారు.