Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 07:48AM

రుణమాఫీకి ఆధార్‌ నమోదుకు నేటితో గడువు పూర్తి

నెల్లూరు - ఆంధ్రజ్యోతి : రుణమాఫీ అమలు కోసం ఆధార్‌ నమోదుకు సోమవారంతో గడువు ముగిస్తోంది. గత నెల 14 నుంచి ఆధార్‌ నమోదును బ్యాంకర్లు సాగిస్తున్నారు. రుణమాఫీ అమలులో తలెత్తే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో నియమించిన గ్రీవెన్స్‌ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌ ఎన్‌. శ్రీకాంత్‌ నియమితులయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో రుణమాఫీ లెక్కలను బ్యాంకర్లు తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆధార్‌ సీడింగ్‌ పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకు శాఖ మేనేజర్లపైనే ఉందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. రైతన్న లు చివరి రోజు సద్వినియోగం చేసుకుని ఆ ధార్‌ వివరాలను బ్యాంకర్లకు అందించాలని కలెక్టర్‌ ఎన్‌. శ్రీకాంత్‌ కోరారు.
నెల రోజులుగా..
రుణమాఫీ అమలుకు గత నెల 14న ప్రభుత్వం జీవో చేసింది. బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల వివరాలు సేకరించేందుకు ఆధార్‌, రేషన్‌ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం తదితర వివరాలతో అనుసంధానం చేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లా స్థా యిలో మానటరింగ్‌ కమిటీని నియమించి ప్రక్రియను ప్రారంభించారు. సోమవారం సా యంత్రం 5 గంటల్లోగా ఆధార్‌ నమోదు ప్ర క్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే చా లా బ్యాంకులు ఈ వివరాలను సేకరిస్తుండ గా, పట్టణ, ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు శాఖల అధికారులు మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు రైతులను నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే ఆ యా బ్యాంకు శాఖల ముఖ్య అధికారులతో సమాచారం అం దచేసి ఎట్టి పరిస్థితిలో సోమవారం సాయంత్రంలోగా ఆధార్‌ సీడింగ్‌ పూర్తి చేయాల్సిందేనని ఎల్డీఎం వెంకటేశ్వరరావు ఆదేశించారు. జిల్లాలో 342 బ్యాంకు శాఖల్లో సుమారు రూ. 4,500 కోట్ల వరకు రైతుల బకాయిలు ఉన్నట్లు ప్రాధమిక అం చనా. ఆధార్‌ అనుసంధానంతో పూర్తి లెక్కలు అందనున్నాయి.
గ్రీవెన్స్‌ కమిటీ
రుణమాఫీ అమలుకు జిల్లా స్థాయిలో ప్రభుత్వం గ్రీవెన్స్‌ కమిటీని నియమించింది. కలెక్టర్‌ ఎన్‌. శ్రీకాంత్‌ చైర్మన్‌గా, ఎల్డీఎం వెంకటేశ్వరరావు తదితర ఉన్నతాధికారులు గ్రీవెన్స్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రుణ మా ఫీలో వచ్చే ఫిర్యాదులు, సమస్యలన్ని ఈ కమిటీ జిల్లా స్థాయిలోనే పరిష్కరిస్తుంది. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను రాష్ట్ర కమిటీకి నివేదిస్తారు. బ్యాంకులు అందించిన వివరాలు తరువాత ఈ కమిటీకి అందే ఫిర్యాదులు పరిశీలిస్తారు.
కాగా రుణాలు పొందిన రైతన్న లు ఆయా బ్యాంకుల్లో ఆధార్‌, ఇతర వివరాలను అందించినప్పుడే వారికి రుణ మాఫీ అందుతుందని కలెక్టర్‌ ఎన్‌. శ్రీకాంత్‌ తెలిపారు. సోమవారం చివరి రోజు కావడంతో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, బ్యాంకులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.