Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 10 2016 @ 00:55AM

గేల్‌కు మొండిచేయి

సెయింట్‌ జాన్స్‌ (ఆంటిగ్వా): వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌కు ఈ ఏడాది వెస్టిండీస్‌ బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కలేదు. గేల్‌తో పాటు టీ20 కెప్టెన్‌ డారెన్‌ సామి, ఆల్‌రౌండన్‌ డ్వేన్‌ బ్రావో, ఆండ్రీ రస్సెల్‌తోపాటు ఐసీసీ నిషేధం ఎదుర్కొంటున్న సునీల్‌ నరైన్‌ను కూడా విండీస్‌ బోర్డు పక్కనబెట్టింది. 2015-16 సీజన్‌ ఒప్పంద జాబితా నుంచి పలువురు సీనియర్‌ క్రికెటర్లను విండీస్‌ బోర్డు తప్పించింది. ఇక కొత్త ఒప్పందంలో ఆటగాళ్ల సంఖ్య 12 నుంచి 15కు పెంచారు.