Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 22:47PM

పిల్లలు చూస్తుండగానే భార్యను కాల్చి చంపిన పోలీసాఫీసర్

న్యూయార్క్: అనుమానం పెనుభూతం అంటారు. దానిని మొగ్గలోనే తుంచేయకపోతే ఎంత ప్రమాదమో ఈ ఘటన చదివితే అర్థం అవుతుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ పోలీస్ అధికారి ఆమెను అత్యంత దారుణంగా కాల్చి చంపేశాడు. నేరం రుజువు కావడంతో కోర్టు అతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. న్యూయార్క్ సిటీ ట్రాన్సిట్ అధికారిగా పనిచేస్తున్న కెవిన్ కేంటీ(44) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతని భార్య జెస్సికా కాంటీ(40)పై కెవిన్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె తనని మోసం చేస్తోందని భావించాడు. శనివారం ఈ విషయంలో శనివారం వీరిద్దరూ గొడవపడ్డారు. అది కాస్తా ముదిరడంతో కెవిన్ ఆగ్రహం పట్టలేక తన సర్వీస్ రివాల్వర్‌తో భార్యపై కాల్పుల వర్షం కురిపించాడు. దీంతో ఆమె శరీరం జల్లెడలా మారిపోయింది. ఈ మారణకాండ జరుగుతున్న సమయంలో 8,5 ఏళ్ల వయసున్న వారి ఇద్దరు కుమార్తెలు అక్కడే ఉన్నారు. వారు చూస్తుండగానే ఆమెను అత్యంత దారుణంగా కాల్చిచంపాడు. మారణకాండను కళ్లారా చూసిన కుమార్తెలు పోలీసులకు సాక్ష్యం చెప్పారు. నేరం రుజువు కావడంతో కోర్టు అతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.