Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 09:15AM

ఎగ్మూర్ మీదుగా తిరుచ్చి - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు

కోడంబాక్కం : పొంగల్‌ పండుగ రోజుల్లో రద్దీ దృష్ట్యా ప్రయాణీకుల సౌకర్యార్ధం రైల్వేశాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ రైల్వే అధికారులు శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలోని వివరాలిలా వున్నాయి...
 
1. తిరుచ్చి - సికింద్రాబాద్‌ :
నెం.00640 తిరుచ్చి - సికింద్రాబాద్‌ సువిధ ప్రత్యేక రైలు జనవరి 17న మధ్యాహ్నం 1 గంటలకు తిరుచ్చిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సికింద్రబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు శ్రీరంగం, విరుదాచలం, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్‌, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.
 
2. మంగళూర్‌ జంక్షన్ - చెన్నై సెంట్రల్‌ :
నెం.00637 మంగళూర్‌ జంక్షన - చెన్నై సెంట్రల్‌ సువిధ సూపర్‌ఫాస్ట్‌ ప్రత్యేక రైలు జనవరి 17వ తేదీన రాత్రి 7.50 గంటలకు గంటలకు మంగళూరు జంక్షనలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఈ రైలు కాసరగూడ్‌, కన్హనగడ్‌, పయ్యనూర్‌, కానూర్‌, తలసేరి, వడకర, కోళికోడ్‌, తిరూర్‌, కుట్టిపురం, షోరానూర్‌ జంక్షన, పాలక్కాడ్‌, కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్డు, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, అరక్కోణం, పెరంబూర్‌ స్టేషన్లలో ఆగుతుంది.
 
3. రామేశ్వరం - చెంగల్పట్టు :
నెం. 06165 రామేశ్వరం - చెంగల్పట్టు ప్రత్యేక రైలు జనవరి 16న రాత్రి 9.30 గంటలకు రామేశ్వరంలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు రామేశ్వరంలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చెంగల్పట్టు చేరుకుంటుంది. మరోమార్గంలో నెం. 06166 చెంగల్పట్టు - రామేశ్వరం ప్రత్యేక రైలు జనవరి 17న రాత్రి 9.30 గంటలకు చెంగల్పట్టులో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. ఈ రైళ్లు మండపం, ఉచ్చిపులి, రామనాథపురం, పరమకుడి, మానామదురై, మదురై, దిండుగల్‌, తిరుచ్చి, విరుదాచలం, విల్లుపురం, మేల్‌మరువత్తూర్‌ స్టేషన్లలో ఆగుతుంది. పై రైళ్లకు రిజర్వేషన్ సౌకర్యం శనివారం ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటనలో తెలిపారు.