desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 09:09AM

వైగో చెయ్యి నరుకుతానన్న నేత అరెస్ట్

తమిళనాడు: ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో చేయి తెగనరుకుతానన్న డీఎంకే ప్రముఖుడిని మదురై తిరుమంగళం పోలీసులు అరెస్టు చేశారు. గత రెండో తేదీన మదురై దక్షిణ డీఎంకే విభాగం ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ జరిగింది. ఇందులో తిరుమంగళం నగర మాజీ అధ్యక్షుడు రాజేంద్రన్‌.. ముఖ్యమంత్రి జయలలిత, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోలపై విమరలు గుప్పించారు.
 
ముఖ్యంగా డీఎంకేను విమర్శించే వైగో.. పబ్లిసిటీ కోసం లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుకోసం ఇతరులకు అమ్ముడు పోయే వైగో... డీఎంకేను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంతేకాకుండా, ఇకపై డీఎంకేను లేదా తమ అధినేత కరుణానిధిని విమర్శించినా... తిరుమంగళం మీదుగా వైగో వెళ్లే సమయంలో ఆయన చేయి తెగనరుకుతానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై స్థానిక ఎండీఎంకే నేతలు తిరుమంగళం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు... రాజేంద్రన్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.