Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 07:03AM

‘పెద్ద’ పంచాయతీల్లో..అక్రమాలపై ఆరా

అనుమతులున్నా లేకపోయినా తుళ్లూరులో పలు అంతస్తుల భవనాలు ఇప్పటికే నిర్మితమయ్యాయి. వీటిలో పార్కింగ్‌ సమస్య ఉంది. జిల్లాలో పెద్ద పంచాయతీలపై నిఘా వర్గాలు కన్నేశాయి. ఏసీబీ అధికారులు డీపీవో వీరయ్య ఆస్తులపై దాడులు చేసిన తర్వాత రెండో దశలో కాంట్రాక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్లపై దృష్టి సారించాయి. ప్రధానంగా ఈ పంచాయతీల్లో బ్లీచింగ్‌, సున్నం, విద్యుత్‌ పరికరాలు, స్టేషనరీపైనే ఏసీబీ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
 
(ఆంధ్రజ్యోతి - గుంటూరు)
జిల్లాలో సుమారు 35-40 పంచాయతీల్లో ఏడాదికి రూ. కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ఆదాయం ఉంది. ఈ పంచాయతీల్లో కాంట్రాక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున స్వాహా పర్వానికి తెరలేపినట్లు తెలిసింది. ఈ పంచాయతీలపై నిఘా వర్గాలు కన్నేశాయి. జిల్లా పంచాయతీ అధికారి గోరంట్ల వీరయ్యను సస్పెండ్‌ చేసిన తర్వాత పెద్ద పంచాయతీల్లో గోల్‌మాల్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది.
జిల్లా వ్యాప్తంగా పెద్ద పంచాయతీల్లో సుమారు రూ.కోటికిపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటిలో సున్నం, బ్లీచింగ్‌ బిల్లులే ఎక్కువ. పెండింగ్‌ బిల్లులకు చెక్కులు ఇవ్వాలని కాంట్రాక్టర్లు పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో బ్లీచింగ్‌, సున్నం, విద్యుత్‌ పరికరాలు, స్టేషనరీపైనే ఏసీబీ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఆయా పంచాయతీల్లో కాంట్రాక్టర్లు ఇచ్చిన బిల్లులను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ బిల్లుల ఆధారంగా కాంట్రాక్టర్లు వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో నమోదు అయ్యారో లేదో వివరాలు సేకరిస్తున్నారు. ఆడిట్‌ నివేదికలు ఇచ్చారా లేదా అనే అంశాన్ని కూడా సేకరిస్తున్నారు.

పారిశుధ్యం పేరుతో గోల్‌మాల్‌..

పెద్ద పంచాయతీల్లో పారిశుద్ధ్యం పేరుతో గోల్‌మాల్‌ జరిగినట్లు తెలిసింది. రాజధాని ప్రాంతాల్లో వారానికి నాలుగైదు రోజులు సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనలు జరుగుతున్నాయి. అనేక మంది వీఐపీలూ ఈ ప్రాంతాలకు వస్తున్నారు. వాటిని ఆసరా చేసుకొని బ్లీచింగ్‌, సున్నం పేరుతో పెద్దఎత్తున నిధులు స్వాహా చేసినట్లు తెలిసింది. వీరయ్య హయాంలో చక్రం తిప్పిన కాంట్రాక్టర్లు ఇంకా పరారీలోనే ఉన్నారు. వారం, పదిరోజుల్లో పెద్ద పంచాయతీల్లోని కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్లలో కొ ంతమందిపై వేటు పడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.