desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 03:44AM

దందాపై దర్యాప్తు ముమ్మరం

  • దేశవ్యాప్తంగా నలుగురు ఏజెంట్ల కీలకపాత్ర
  • 4 రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్‌ బృందాలు
  • జాతీయ సంస్థల దర్యాప్తునకు వినతి
  • త్వరలో కొలంబోకు ప్రత్యేక బృందాలు
నల్లగొండ, జనవరి 8: కిడ్నీ రాకెట్‌పై నల్లగొండ జిల్లా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ రాకెట్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా నలుగురు ఏజెంట్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని, పశ్చిమబెంగాల్‌ కేంద్రంగా ఈ దందా జరుగుతున్నదని అనుమానిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఈ దందాతో సంబంధమున్న నలుగురిని అరెస్టుచేసి, వివరాలు రాబడుతున్నారు. వారి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను తనిఖీచేస్తున్నారు. అయితే, ఈ రాకెట్‌ సోషల్‌ మీడియా ద్వారా కార్యకలాపాలు సాగిస్తుండటం తో జాతీయదర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే గుట్టు ఛేదించవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు సమాచారం. కిడ్నీ రాకెట్‌ బాధితులు వివిధ రాష్ట్రాల్లోనేగాక శ్రీలంక, ఇరాన్‌ దాకా ఉన్నట్లు సమాచారం. దీంతో ఎస్పీ విక్రమ్‌జిత దుగ్గల్‌ ఆదేశాల మేరకు 4 ప్రత్యేక బృందాలు అహ్మదాబాద్‌, చెన్నై, హైదరాబాద్‌, ముంబైలకు వెళ్లాయి. కొలంబోలో ఈ ముఠాతో సంబంధమున్న మూడు ఆస్పత్రులకూ వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఏడాదినుంచీ ఈ రాకెట్‌ జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్నా పసిగట్టలేకపోవడం పోలీసుల వైఫల్యమేనని విమర్శలు వస్తు న్నాయి. ఈ దందాపై తొలుత జనమే సమాచారం ఇవ్వటంతోపాటు ప్రధాన ఏజెంటు సురేష్‌పై దాడిచేశాకే పోలీసులు కళ్లుతెరిచారు. కాగా, అబ్దుల్‌ హఫీజ్‌ అనే వ్యక్తి ఇటీవల ఖరీదైన వస్తువులు కొం టూ విలాసంగా జీవిస్తు న్నాడు. దీనిపై కుటుంబీకులు నిలదీయగా కిడ్నీ అమ్ముకున్నానంటూ ఆపరేషన్‌ గాట్లు చూపాడు. వారు ఒత్తి డి చేయగా సురేష్‌ పేరు, చిరునామా వెల్లడించాడు. ఈ మేరకు సురే్‌షపై వారు దాడిచేశారు. అటుపైన ఇరుగుపొ రుగు పోలీసులకు సమాచారమిచ్చారు.