Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 02:48AM

ధోనీకి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

  • జారీ చేసిన అనంతపురం కోర్టు
అనంతపురం (ఆంధ్రజ్యోతి): టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెం ట్‌ జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 25లోపు ధోనీ కోర్టుకు హాజరుకావాలని, లేనిపక్షంలో అరెస్టు చేసి హాజరుపర్చాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. గతంలో నోటీసులు పంపినా కోర్టుకు హాజరు కాకపోవడంపై మహీపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా.. ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం ఆసే్ట్రలియా పర్యటనలో ఉంది. ఈనెల 31న టూర్‌ ముగుస్తుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ మేగజిన్‌లో ధోనీని విష్ణుమూర్తి అవతారంలో ముద్రించి దేవతలను అవమానించారని విశ్వ హిందూ పరిషత్‌ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శ్యాం సుందర్‌ 2013 జూన్‌లో కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది నవంబర్‌లో కోర్టుకు హాజరుకావాలని ధోనీని కోర్టు ఆదేశించింది. సమన్లు తీసుకున్నప్పటికీ వ్యక్తిగతంగా ధోనీ హాజరుకాలేదు. తన న్యాయవాది ద్వారా కౌంటర్‌ దాఖలు చేయలేదు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తూ ధోనీకి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.