Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 02:36AM

శత్రు ఆస్తుల బదిలీ నిషిద్ధం.. ఆర్డినెన్స్‌కు ఆమోదం

న్యూఢిల్లీ, జనవరి 8: దాదాపు 50 ఏళ్లనాటి శత్రు ఆస్తుల చట్టానికి సవరణ చేస్తూ కేంద్రం తీసుకువచ్చిన కీలక సవరణలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం పాకిస్థాన్‌తో 1965, 1971 యుద్ధాల తర్వాత పాక్‌కు వలసవెళ్లిపోయిన వారి ఆస్తులను తిరిగి వారికి బదలాయించడానికి వీల్లేదు. గతంలో రెండు యుద్ధాల తర్వాత వేలాదిమంది వలసవెళ్లి పాక్‌ పౌరసత్వం తీసుకోవడంతో....భారత రక్షణ చట్టం కింద కేంద్రం వారి ఆస్తులు, కంపెనీలను స్వాధీనం చేసుకుంది. 1968లో కేంద్రం శత్రు ఆస్తుల చట్టాన్ని తీసుకురావడంతో ‘శత్రు’ ఆస్తులన్నీ క్రమంగా కస్టోడియన్‌(ప్రభుత్వం) చేతిలోకి వచ్చాయి. ఈ చట్టంలోని కొన్ని లోపాలను సరిదిద్దుతూ ఇప్పుడు మోదీ సర్కారు ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది.