Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 00:53AM

ప్రతి ప్రాజెక్టుకు ప్రోగ్రెస్ కార్డు

  • ప్యాకేజీలవారీగా సమస్యల గుర్తింపు.. పరిష్కారం
  • మహబూబ్‌నగర్‌ జిల్లాపై సమీక్షలో మంత్రి హరీశ్‌
  • భూ సేకరణ, పునరావాసం, పనులపై అసంతృప్తి
హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రతి ప్రాజెక్టుపై ఈ నెలనుంచి జూన్‌వరకు నెలవారీ ప్రోగ్రెస్‌ కార్డు, జాబ్‌చార్ట్‌ రూపొందించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. వీటి ఆధారంగానే తదుపరి సమీక్ష కొనసాగుతుందని చెప్పారు. ప్యాకేజీలవారీగా అన్నిరకాల సమస్యలను గుర్తించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రగతిపై శుక్రవారం ఆయనిక్కడ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులతోపాటు సంబంధిత కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూసేకరణ, పునరావాస కల్పనలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ధరల పెంపుదలకు సంబంధించి జీవో 146 ప్రకారం జిల్లా ప్రాజెక్టుల్లోని 18 ప్యాకేజీలలో మూడింటికి మాత్రమే ప్రతిపాదనలు పంప డంపైనా అసహనం వెలిబుచ్చారు.
 
ధరల పెరుగుదలను వర్తింప చేయకపోతే కాంట్రాక్టర్లు పని చేయడం లేదని, పనులు జరగడం లేదు కదా అని భూసేకరణ, పునరావాస సమస్యలను పరిష్కరించడం లేదని వ్యాఖ్యా నించారు. కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ప్రాజెక్టులో నాలుగు పంపులు పనిచే స్తున్నా డిసి్ట్రబ్యూటరీ కాల్వల పనులు నత్తనడకన సాగటాన్ని తప్పుపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌కల్లా జిల్లాలో నిర్దేశిత ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అన్ని పనులూ సమాంతరంగా సాగేలా చూడాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌, నీటిపారుదల, భూసేకరణ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా కాంట్రా క్టర్లకు ఇసుక సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా, ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టివద్ద బ్యారేజీ, గోదావరిపై మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణంపై చర్చించేందుకు ఈ నెల 12నమంత్రి ముంబై వెళ్తారు. అక్కడ మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్‌ మహాజన్‌తో సమావేశం కానున్నారు. ఇందుకోసం వ్యాప్కోస్‌ ప్రతినిధులతో సమావేశమై ఆ రెండు బ్యారేజీల డిజైన్‌ మహారాష్ట్ర లేవనెత్తిన సాంకేతిక అభ్యంతరాలపై చర్చించారు. వాటి డీపీఆర్‌లను వెంటనే ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని అధికారులను ఆదేశించారు.