Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 00:31AM

రిజిస్ట్రేషన్లకు ఇక ఈ-చలాన్

  • ఎస్‌బీహెచ్‌లో ఖాతా ఉంటే ఇంటినుంచే
  • ఆమోదించిన ప్రభుత్వం... ఉత్తర్వులు జారీ
హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇకపై స్థిరచరాస్తుల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన రుసుముల చెల్లింపునకు సొమ్ము లేదా డీడీలు చేతబట్టుకుని సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లే పనిలేదు. దేశవిదేశాల్లో ఎక్కడున్నా నిక్షేపంగా కంప్యూటర్‌ ముందు కూర్చుని ఈ-చలాన కట్టేయవచ్చు. ఈ మేరకు http://registration.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ-చలాన స్ర్కోలింగ్‌ను నొక్కి... వ్యక్తిగత వివరాలు, విక్రయ-కొనుగోలుదారుల పేర్లు, చిరునామా, డాక్యుమెంట్‌ రకం తదితర వివరాలు నమోదు చేస్తే చాలు... స్టాంప్‌ డ్యూటీ కింద ఎంత చెల్లించాలో ప్రత్యక్షమవుతుంది. అటుపైన ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ)లో ఖాతా ఉంటే ఆనలైనలోనే చెల్లించి, ఈ-చలాన్ పొందవచ్చు. ఈ విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శుక్రవారం రెవెన్యూ శాఖ (రిజిస్ట్రేషన్స్) ముఖ్యకార్యదర్శి ఎస్‌.కె.జోషి జీవో (నం.18) జారీచేశారు. దీనికి అనుగుణంగా ఎస్‌బీహెచతో ఒప్పందం చేసుకుని, అమలుకు మార్గదర్శకాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. ఇక చెల్లింపు ముగిసి, చలాన్‌ రాగానే ఆ సమాచారం నేరుగా స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ విభాగం ఐజీ, సంబంధిత జిల్లా డీఐజీ, సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు చేరుతుంది. అటుపైన కార్యాలయానికి వెళ్లి ఈ-చలాన్‌ అందజేస్తే డాక్యుమెంట్‌ నమోదవుతుంది. ఈ విధానం వల్ల అటు కార్యాలయాల్లో సిబ్బందికి, ఇటు రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారికీ ప్రస్తుతం ఎదురవుతున్న అనేక ఇబ్బందులు, అక్రమాలు, అవినీతికి తావుండదు.