Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 8 2016 @ 21:32PM

ఆ సమయంలో నొప్పి ఎందుకు?

ప్రశ్న: నాకు 32 ఏళ్లు. సెక్స్‌ సమయంలో అసౌకర్యంగా, నొప్పిగా ఉంటోంది. ఎందుకు?
జవాబు: లైంగిక చర్యలో నొప్పికి కారణం మానసికమైనది కావొచ్చు, శారీరకమైనది కావొచ్చు. అనుభవఙ్ఞులైన లేడీ డాక్టర్‌ని కలిస్తే కారణం ఏంటి? దానికి చికిత్స ఏదైనా ఉందా? అనే విషయం అర్థమవుతుంది. శారీరక ఇబ్బందికి కారణం మానసికమైనదైతే దాన్ని ఎలా అధిగమించవచ్చో వైద్యులు మాత్రమే సూచించగలుగుతారు. సెక్స్‌కు ముందు తగినంత ఫోర్‌ప్లే, వాటర్‌ బేస్‌డ్‌ లూబ్రికెంట్స్‌తో సెక్స్‌ సమయంలో నొప్పి, ఇబ్బందిని తగ్గించవచ్చు. కొన్నిసార్లు సెక్స్‌ పొజిషన్‌ మార్చటం వల్ల కూడా నొప్పి అదుపులోకొస్తుంది. విపరీతమైన ఒత్తిడి వల్ల కూడా లైంగిక చర్య ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే చివరికి పూర్తిగా సెక్స్‌కే దూరమైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నొప్పికి అసలు కారణాన్ని వైద్యుల ద్వారా తెలుసుకుని వారిచ్చే సలహా ప్రకారం నడుచుకోవాలి.

డాక్టర్‌. షర్మిల మజుందార్‌
కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌
రామయ్య ప్రమీల హాస్పిటల్‌, హైదరాబాద్‌
[email protected]