Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 8 2016 @ 03:55AM

గవర్నర్‌తో కడియం భేటీ

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గవర్నర్‌ నరసింహన్ తో గురువారం రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు. 15 నిమిషాలపాటు గవర్నర్‌తో సమావేశమైన కడియం రాష్ట్రంలో చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించినట్లు సమాచారం. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, యూనివర్సిటీల వీసీల నియామకానికి నోటిఫికేషన జారీ చేసిన విషయాన్ని చెప్పినట్లు తెలిసింది.