Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 05:31AM

జిల్లాలో ఎదురు కాల్పులు


అగీబెల్లంపల్లి : బెల్లంపల్లి పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలోని తిర్యాణి మండలం మర్కగూడ అడవుల్లో ఆదివారం ఉదయం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కొంత కాలంగా మావోయిస్టుల కోసం పోలీసులు గా లింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇదే తరుణంలో ఆదివారం ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కా ల్పులు జరిగాయి. కాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టులు తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలంలో మావోయిస్టులు వదిలి వెళ్లిన కిట్‌ బ్యా గులు ఇతర వస్తువులను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తిర్యాణి మండలంలో ఎదురు కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. 2 నెలల క్రితం కాసిపేట మండలం కుర్రెగఢ్‌ అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరగగా సరిగ్గా 2 నెలల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడంతో తిర్యాణి మండలంలోని మంగి, గంభీరావుపేట, గిన్నెధరి, అర్జున్‌లొద్ది, గోవెన తదితర గ్రామాల్లో అలజడి నెలకొంది. ఈ సంఘటనతో గ్రామాల్లో గిరిజనులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా బెల్లంపల్లి అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ను ఎదురు కాల్పులపై వివరణ కోరగా ఎదురు కాల్పులు జరిగింది పంగిడిమాదర -మర్కగూడ అడవుల్లోనేనని తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.