Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 7 2016 @ 20:24PM

ఇండియా.. ఎప్పటికీ ఇన్‌క్రెడిబుల్: అమిర్

ముంబై: ఇండియా ఎప్పటికీ ఇన్‌క్రెడిబుల్‌గా ఉంటుందని బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ అన్నారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయనను తొలగించడంపై స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తానన్నారు. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా లేకపోయినా ఇండియా ఇన్ క్రెడిబుల్‌గా ఉంటుందని అమిర్ ఖాన్ అన్నారు. పదేళ్ళుగా ఇండియా ప్రచారకర్తగా వ్యవహరించిన తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. అయితే అసహనంపై అమిర్ చేసిన వ్యాఖ్యలతోనే ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించినట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పర్యాటక, సంసృతిక శాఖా మంత్రి మహేష్ శర్మ వివరణ ఇచ్చారు. దేశ, విదేశాల్లో భారత్ గొప్పదనాన్ని చాటేలా లఘు చిత్రాలు నిర్మించిన యాడ్ ఏజెన్సీతో కాంట్రాక్ట్ ముసిగిందన్నారు. ఆ ఏజెన్సీనే అమిర్‌ను ప్రచార కర్తగా ఎంచుకుందని, ఆయన తొలగింపుతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని మహేష్ శర్మ స్పష్టం చేశారు.