Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 7 2016 @ 17:28PM

కరువు మండలాల ప్రకటనలో కరీంనగర్‌కు అన్యాయం : జీవన్‌రెడ్డి

 కరీంనగర్ : కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిల సొంత జిల్లాలైన మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పూర్తి స్థాయిలో కరువు మండలాలను ప్రకటించారన్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలో ఒక్క సిరిసిల్లను మాత్రమే గుర్తించి మిగతా మండలాలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. కేవలం ఎన్నికలు జరిగే ప్రాంతాలపైనే సీఎం కేసీఆర్ దృష్టిపెడుతున్నారన్నారు. అలాగే నిజాం షుగర్స్ లే ఆప్‌తో రైతులు రోడ్డున పడ్డారన్నారు.