Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 7 2016 @ 12:16PM

అల్లరి చేశాడని మూడేళ్ల పసివాడిని రక్తమొచ్చేలా కొట్టిన తల్లిదండ్రులు

మెదక్: జిల్లాలోని పటాన్ చెరు మండలంలో దారుణం జరిగింది. చిన్నారులన్నాక అల్లరి చేస్తుంటారు. ఆ అల్లరి శ్రుతి మించితే మందలించడానికి తల్లిదండ్రులు ఓ దెబ్బ వేయడం సహజం. కానీ మెదక్ జిల్లాలోని పటాన్ చెరులో ఓ చిన్నారి తల్లిదండ్రులు ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు. పిల్లాడు అల్లరి చేయడం ఏదో క్షమించరాని నేరంగా భావించారో ఏమో తెలియదు కానీ కన్న కొడుకని కూడా చూడకుండా చితకబాదారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు ఆ పసివాడి కళ్లు, ముఖం కమిలిపోయాయి. దెబ్బలు గట్టిగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటన చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం శాంతినగర్‌కు చెందిన రాధా, శివకుమార్ దంపతులు తమ మూడేళ్ల చిన్నారిని అమానుషంగా కొట్టారు. పోలీసులు వారిద్దరి పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.