Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 7 2016 @ 11:58AM

ఇష్టపడి కొనుక్కున స్మార్ట్ ఫోన్ పోయిందని...

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, బెంగళూరు: ఖరీదైన మొబైల్స్‌ను పిల్లలకు అలవాటు చేయవద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా పెద్దలు పట్టించుకోవడం లేదు. పలు ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థుల చేతులలో అత్యంత ఖరీదైన ఐఫోన్స్ దర్శనమిస్తున్నాయి. రూ.30 వేల నుంచి 50వేల విలువ చేసే చాకొలేట్‌ల మాదిరిగా కొనిచ్చేస్తున్నారు. అంతవరకైతే సమస్య లేదుగానీ ఖరీదైన ఐ ఫోన్‌ల కోసం ఒక్కోసారి విద్యార్థుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఐ ఫోన్‌లు చోరీ అయితే ఫిర్యాదు చేసేందుకు కూడా కొన్ని కళాశాలల్లో అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ఫోన్ చోరీకి గురైనా చాలామంది మిన్నకుండిపోతున్నారు.
 
తామెంతో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ చోరీకి గురికావడంతో తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ దారుణ ఘటన నగరంలో బుధవారం వెలుగు చూసింది. నెలమంగలకు చెందిన విద్యార్థి సందీప్‌ (18) ఇక్కడి హార్వర్డ్‌ కాలేజీలో ద్వితీయ పీయూసీ చదువుతున్నాడు. తన ఫోన్ చోరీకి గురి కావడంతో తట్టుకోలేక అరిసినగుంటెలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకు చెప్పి ఉంటే ఎలాగోలా ఓదార్చేవారమన్నారు. నెలమంగల పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేపట్టారు.