Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 03:22AM

భాయియో ఔర్‌ బెహెనో..


ఐరాసలో మోదీ హిందీ ప్రసంగం: రాజ్‌నాథ్‌
ఘనంగా హిందీ దివస్‌ కార్యక్రమాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 14: హిందీపై తన అభిమానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రకటించనున్నారు. ప్రపంచంలోని అత్యధిక దేశాలు పాల్గొనే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలోనే మాట్లాడాలని ఆయన నిర్ణయించుకున్నారు. వాజ్‌పేయి తర్వాత ఐరాస సమావేశంలో హిందీలో మాట్లాడిన భారత రెండో ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. హిందీ దివస్‌ సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సంగతి వెల్లడించారు. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే ఐరాస సర్వసభ్య భేటీలో ఈ నెల 27న ప్రధాని ప్రసంగించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. విదేశీ బృందాలతో చర్చల్లోనూ మోదీ హిందీలోనే మాట్లాడతారని పేర్కొన్నారు. కాగా దేశభాషల్లో తనదైన ప్రత్యేకత గల హిందీకి పూర్తి స్థాయి ప్రాచుర్యం కల్పించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో పేర్కొన్న 21 భారతీయ భాషల్లో హిందీ ప్రత్యేకమైనదని తెలిపారు. కేంద్ర మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్లను హిందీలో రూపొందించేందుకు కృషి చేయాలని అధికార భాషాశాఖకు సూచించారు.