Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 7 2016 @ 01:53AM

బీఎస్‌-5 ఉండదు.. నేరుగా ఆరుకే!

  • కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు 
  • మారేందుకు పెట్టుబడి 28,750 కోట్లు 
  •  కార్యదర్శులతో అధ్యయన బృందం: ధర్మేంద్ర ప్రధాన్‌ 
న్యూఢిల్లీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వాహన కర్బన ఉద్గారాల నియంత్రణ, వాయు కాలుష్య తగ్గింపు దిశగా కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా వాహన ఇంధన ప్రమాణాల ఐదో దశ (భారత్‌ స్టేజ్‌-5)ను వదిలేసి నేరుగా ఆరోదశను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, భారీ పరిశ్రమలు, పర్యావరణ, పెట్రోలియం శాఖల మంత్రులు నితిన్‌ గడ్కరీ, అనంత్‌ గీతె, ప్రకాశ్‌ జావడేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌తోపాటు సీనియర్‌ అధికారులు బుధవారం ఇక్కడ సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో బీఎస్‌-4 ఇంధనం సరఫరా చేస్తుండగా, దీన్ని ఈ ఏడాది ఏప్రిల్‌నాటికి మరికొన్ని నగరాలకు విస్తరించాలని నిర్ణయించారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో బీఎస్‌-3 ఇంధనమే సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఒక్కసారిగా బీఎస్‌-6 ప్రమాణాలను అందుకోవాలని తీర్మానించారు. వాస్తవానికి ఈ ప్రమాణాన్ని 2024 నుంచి అమలు చేయాల్సిందిగా వాహన ఇంధన విధానంలో సిఫారసు చేశారు. ఆ తర్వాత ఈ గడువును 2021కి, తాజాగా 2020కి కుదించారు. మరో నాలుగేళ్లకల్లా ఆ ప్రమాణాలకు తగినట్లు ఇంధన సరఫరా చేయగలమని ధర్మేంద్ర ప్రధాన్‌ హామీ ఇచ్చారు. ఇందుకోసం ఇంధన సంస్థలు రూ.28,750 కోట్లు పెట్టుబడి పెడతాయని కూడా వివరించారు. ఆ సమయానికి దేశంలోని ఆటోమొబైల్‌ పరిశ్రమ కూడా సాంకేతికంగా సిద్ధం కాగలదని కేంద్రం భావిస్తోంది. బీఎస్‌-6 ఇంధనం, ఇతర అంశాలకు సంబంధించి సంబంధిత శాఖల కార్యదర్శులతో అధ్యయన బృందం ఏర్పాటు చేస్తామని, ఇది రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని చెప్పారు.