Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 7 2016 @ 00:43AM

11 ఏళ్ల కనిష్ఠానికి ముడిచమురు

  • 35 డాలర్ల దిగువకు పీపా ధర 
లండన్‌: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పతనం కొనసాగుతూనే ఉంది. బుధవారం బ్రెంట్‌ క్రూడ్‌ పీపా ధర 34.83 డాలర్ల కనిష్ఠ స్థాయిని తాకింది. 2004 తర్వాత క్రూడాయిల్‌ ధర 35 డాలర్ల దిగువకు రావడం ఇదే తొలిసారి. ఇరాన్‌, సౌదీ మధ్య టెన్షన్ల కారణంగా ఉత్పత్తిపై కోత విధించడంలో ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవచ్చన్న అంచనాలు చమురు ధరపై ప్రభావం చూపాయి. అమెరికా నిల్వలు పెరుగుతాయన్న అంచనాలు, డాలర్‌ బలపడడం ముడి చమురును మరింత కుంగదీసాయి. పులి మీద పుట్రలా ఉత్తర కొరియా అణు పరీక్ష జరిపిందన్న వార్తలు చమురు ధరను మరింత దిగజార్చాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద చము రు వినియోగదారు చైనా మందగమనం బారిన పడడంతో చమురు డిమాండ్‌ మరింత తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సౌదీ, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఒపెక్‌ బలహీనతకు దారితీస్తాయన్న భయాలున్నాయి. ఇప్పటివరకు ముడిచమురు ధరలు, ఉత్పత్తి విషయంలో ఒపెక్‌ దేశాలు కలిసికట్టుగా వ్యవహరిస్తున్నాయి. పై రెండు దేశాల ఉద్రిక్తతలతో ఒపెక్‌కు బీటలు వారే ప్రమాదం ఉందని, అదే జరిగితే అతి ఉత్పత్తి కట్టడి మరింత కష్టమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.