Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 6 2016 @ 15:40PM

సరి, బేసి ట్రయల్ రన్‌‌కు వారం చాలదా.. ?

న్యూఢిల్లీ, జనవరి 6: దేశ రాజధానిలో అమలవుతున్న సరి, బేసి వాహనాల ట్రయల్ రన్‌‌కు వారం సరిపోదా అని ఢిల్లీ హైకోర్టు ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్య నియంత్రణ కోసం సీఎం కేజ్రీవాల్ జనవరి 1 నుంచి 15 వరకు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే సరిపడా ప్రజా రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ట్రయల్ రన్‌ను వారానికి పరిమితం చేయాలని సూచిస్తూ దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ వారం రోజుల్లో నమోదైన వాయు కాలుష్య గణాంకాల నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.