Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 6 2016 @ 15:30PM

మహేశ్‌ను ఎన్టీఆర్ దాటేశాడు..!

నాన్నకు ప్రేమతో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఎన్టీఆర్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదల కాబోతోంది... ఇదిలా ఉంటే రీసెంట్‌గా శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న మహేశ్‌ను ఓ విషయంలో ఎన్టీఆర్ అధిగమించాడట... ఈ విషయంపై అభిమానుల మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇంతకూ మహేశ్‌పై ఎన్టీఆర్ ఆధిపత్యం చూపించింది యూట్యూబ్ హిట్స్ విషయంలోనట..!
 
'బ్రహ్మోత్సవం'పై 'నాన్నకు ప్రేమతో' ట్రైలర్ పై చేయి!
న్యూ ఇయర్ కానుకగా మహేశ్ బ్రహ్మోత్సవం టీజర్ విడుదలైంది.... అప్పటికే విడుదలైన ఎన్టీఆర్ మూవీ నాన్నకు ప్రేమతో ట్రైలర్‌ను యూట్యూబ్‌లో బ్రహ్మోత్సవం టీజర్ దాటేస్తుందనుకున్నారంతా... అయితే జూనియర్ ట్రైలర్‌తో మహేశ్ టీజర్ పోటీపడలేకపోయింది. బ్రహ్మోత్సవం టీజర్‌కు ఐదున్నర లక్షలకు పై వ్యూస్ ఉండగా.. నాన్నకు ప్రేమతో చిత్రం ఏడున్నర లక్షలకు పైగా వ్యూస్‌తో ముందంజలో ఉంది... ఇక మహేశ్ మూవీ టీజర్‌కు 11000 లైక్స్ ఉండగా.. 24500 లైక్స్ తో ముందంజలో ఉంది ఎన్టీఆర్ మూవీ ట్రైలర్... సంక్రాంతికే ఎన్టీఆర్ సినిమా వస్తుండడం.. మహేశ్ మూవీ రిలీజ్ కు మరింత సమయం ఉండడంతోనే ఇలా జరిగిందంటూ సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల లెక్కలు వేస్తున్నారు... ఏదేమైనా ట్రైలర్ తో ఆకట్టుకున్నఎన్టీఆర్ సినిమాతోనూ మెప్పిస్తాడేమో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే..!