desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 6 2016 @ 13:21PM

12 లక్షల మందికి రేషన్‌కార్డులు: సునీత

అనంతపురం: రాష్ట్రంలో కొత్తగా 12 లక్షల మందికి రేషన్‌కార్డులు ఇస్తున్నామని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత తెలిపారు. నగరంలోని రహ్మత్‌నగర్, గార్లదిన్నెలో బుధవారం జన్మభూమి సభల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. విభజన తర్వాత రాష్ట్రం లోటు బడ్జట్‌లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు మాని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని సునిత కోరారు.