Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 6 2016 @ 12:24PM

9న టీడీపీ శంఖారావం

  • నిజాం కాలేజీ మైదానంలో సభ
  • చంద్రబాబు హాజరు
హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం కోసం ఈనెల 9న నిజాం కళాశాల మైదానంలో శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. ఈ సభలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనలో పార్టీ గ్రేటర్‌ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌తో కలిసి రమణ విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్‌ ఎన్నికల కోసం రూపొందించిన మేనిఫెస్టోను రెండురోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. కాగా.. ఇప్పటికే గ్రేటర్‌ ఎన్నికల కోసం పార్టీ ముఖ్య నేతలను 24 శాసనసభ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలుగా ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. 150 డివిజన్లకు రాష్ట్రస్థాయి నాయకులను పరిశీలకులుగా ఎంపిక చేసినట్టు తెలిపారు.
 
6న గ్రేటర్‌ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్యనేతల సమావేశాలు జరుగుతాయని, 7న 150 డివిజన్లలో పార్టీ పరిశీలకుల సమక్షంలో డివిజన స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ‘షహర్‌ హమారా.. మేయర్‌ హమారా.. అమన శాంతి’ అనే నినాదంతో టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. కాగా తెలుగుదేశం-బీజెపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం జనసేన అధినేత, సినీ హీరో పవన కల్యాణ్‌ను ఆహ్వానించనున్నట్టు మాగంటి గోపీనాథ్‌ తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారని గుర్తు చేశారు. మళ్లీ గ్రేటర్‌ ప్రచారంలో పాల్గొనే విధంగా ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తామన్నారు.