Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 6 2016 @ 11:33AM

కమలం కళ

  • ఫ్లెక్సీలతో బీజేపీ ప్రచారం షురూ
  • బహిరంగ సభలతో ఉత్తేజం
బీజేపీ ప్రచారం షురూ చేసింది. బస్తీలు, కాలనీల్లో బహిరంగ సభలతో పాటు ఫెక్ల్సీలతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రెండు రోజులుగా నగరంలో ఎక్కడ చూసినా బీజేపీ ఫెక్సీలే దర్శనమిస్తున్నాయి. మన హైదరాబాద్‌...మన బీజేపీ నినాదంతో ఈ ఫెక్ల్సీలు వెలస్తున్నాయి.
 
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఫెక్ల్సీల ప్రచారం చేపట్టంది. దానికి ధీటుగా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ను టార్గెట్‌ చేసుకుని ఈ ప్రచారాన్ని చేట్టింది. మాటలు స్కైవే దాటుతాయి...చేతలు రోడ్డెక్కవంటూ ...రజకార్ల వారసులు వద్దే వద్దు అంటు ఫెక్సీలు ఏర్పాటు చేశారు.
ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు, బస్సు స్టాంపుల్లో పెద్ద పెద్ద ఫెక్సీలు కనిపిస్తున్నాయి. ఈ ఫెక్ల్సీలకు కంటే ఒక అడుగు ముందుకేసిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఫెక్ల్సీలను ఏర్పాటు చేసి ప్రచారం చేశారు.
 
బహిరంగ సభలతో....
బహిరంగ సభలతో బీజేపీ మూడు రోజుల నుంచి విస్తృత ప్రచారం చేపట్టింది. అంబర్‌పేట నియోజకవర్గంలో మొదటి బహిరంగ సభను నిర్వహించి టీఆర్‌ఎస్‌పై విమర్శలు సంధించింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో కూడా బహిరంగ సభలను నిర్వహించారు. మల్కజిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హాజరయైు కార్యకర్తలో ఉత్సహాం నింపారు. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలను వేగం నిర్వహించడానికి ప్లాన్‌ చేసుకుంది. మొదట పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో శ్రీకారం చుట్టింది.
 
జెండాలతో....
ఒక వైపు బహిరంగ సభలు నిర్వహిస్తునే మరో వైపు జెండాలతో బస్తీలు, కాలనీల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. జెండా పండుగలను నిర్వహించి కార్యకర్తలను సమీకరిస్తోంది. పాత కొత్త నాయకులతో పాటు పార్టీ అభిమానులను ఈ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. జెండాలతో బస్తీల చౌరస్తాలు కాషాయమయవుతున్నాయి.

విస్తృత సమన్వయ సమావేశాలు...

డివిజన్ల పునర్వీభజనతో మారిన రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకొని కార్యకర్తలు, నాయకులను సమీకరించు కోవడానికి విస్తృత సమావేశాలు నిర్వహిస్తుంది. అటు ఇటు డివిజన్ల మార్పు రావడంతో ఈ సమావేశాలను చేపట్టింది. ప్రస్తుతం మారిన డివిజన్ల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి కార్యకర్తలు, నాయకులను సంఘటితం చేస్తోంది. మరో వైపు మిత్రపక్షమైన తెలుగుదేశంతో కూడా సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసి ఇరు పార్టీల మధ్య ఐక్యత ఉండేందుకు జాగ్రత్త పడుతోంది. డివిజన్‌ ఏ పార్టీకి కేటాయించినప్పటికీ ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు మిత్ర పక్షం గెలుపు కోసం పనిచేసే విధంగా తర్ఫీదు ఇస్తోంది. ఈ సమావేశాల్లో ఇరు పార్టీల అగ్రనాయకులు పాల్గొని కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు.
 
పాతబస్తీలో కూడా..
పాతబస్తీలో బీజేపీ ప్రచారం చేపట్టింది. ఈసారి పాతబస్తీలో పట్టు సాధించడానికి మజ్లిస్‌ ఢీ కొట్టడానికి బీజేపీ సన్నద్దమైంది. ఈనేపథ్యంలో పాతబస్తీలో కూడా విస్తృత ప్రచారం చేపడుతోంది. ఇప్పటికే జెండా పండుగలను నిర్వహించింది. సమీక్ష, సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సన్నద్ధమం చేస్తోంది.