Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 6 2016 @ 10:48AM

ఎయిరిండియాపై అమెరికా వర్శిటీల కన్నెర్ర

హైదరాబాద్ : ఇటీవల వివాదాస్పదమైన అమెరికా యూనివర్శిటీలు ఎయిరిండియాపై పరువు నష్టం దావా వేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అమెరికా అధికారులు సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ (ఎస్‌వీయూ), నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ (ఎన్‌పీయూ)లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు అసత్య ప్రచారం చేసినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాయి. ఎన్‌పీయూ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ఎస్‌వీయూ న్యాయ సలహా తీసుకుంటోంది.
 
ఎన్‌పీయూ ప్రతిష్ఠకు భంగం కలిగించిన ఎయిరిండియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఎన్‌పీయూ ప్రెసిడెంట్ పీటర్ హసీహ్ తెలిపారు. పరువు నష్టం దావాను అమెరికాలో దాఖలు చేస్తారా? ఇండియాలోనా అనే వివరాలను వెల్లడించలేదు. ఎన్‌పీయూ మేనేజ్‌మెంట్ ఎయిరిండియాకు ఘాటైన లేఖ రాసింది. ఎన్‌పీయూ విద్యార్థులు అమెరికాకు ప్రయాణం చేయడాన్ని అసమంజసంగా అడ్డుకున్నందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. తమ విశ్వవిద్యాలయాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరింది. విశ్వవిద్యాలయాలను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారంటూ ఎయిరిండియా వదంతులు ప్రచారం చేసినట్లు భారతదేశంలోని వార్తా పత్రికలు, టీవీ చానళ్లు పేర్కొన్నాయని ఎస్‌వీయూ అసోసియేట్ అకడమిక్ డీన్ సైమన్ అవ్ తెలిపారు. ఎయిరిండియాపై పరువు నష్టం దావా వేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నామన్నారు.
 
 ఇదిలావుండగా, ఈ వారంలో భారతదేశం నుంచి కొత్త విద్యార్థులు వస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. స్ప్రింగ్ ట్రైమెస్టర్ ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులు కాస్త ఆలస్యంగా వచ్చినా, క్లాసులకు రిజిస్టర్ చేసుకొనేందుకు సహకరిస్తామన్నారు.