
గుంటూరు, ఆంధ్రజ్యోతి: సీఆర్డీఏ రీజియనకు సంబంధించిన డ్రాఫ్టు పరె్సపెక్టివ్ ప్లాన - 2050పై అవగాహన సదస్సును జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, ఎంపీలు జయదేవ్, రాయపాటి సాంబశివరావుతో పాటు సీఆర్డీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రైతులు సదస్సుకు హాజరు కానున్నారు. మాస్టర్‌ప్లాన ముసాయిదాలోని అంశాలపై సదస్సులో చర్చ జరుగుతుందని, రైతులు, ఎనజీవోల అభిప్రాయాలను తీసుకుని సీఆర్డీఏకి నివేదిస్తామని అధికారవర్గాలు తెలిపాయి.
వ్యవసాయానికి మూడు జోన్లు
సీఆర్డీఏ పరిధిని వ్యవసాయ, పట్టణ, పారిశ్రామిక, అభివృద్ధి కారిడార్, మౌలిక సదుపాయాలు, రక్షిత జోనలుగా విభజించారు. గుం టూరు, కృష్ణా జిల్లాల్లో కలిపి 8,603.32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగా నిర్ణయించారు. ఇం దులో వ్యవసాయాన్ని మూడు జోన్లుగా విభజించారు. ఒక జోనలో 3,820.75 చదరపు కిలోమీటర్లు, జోన-2లో 1,137.86 చ దరపు కిలోమీటర్లు, జోన-3లో 481.65 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఈ మొత్తం విస్తీర్ణం 63.23 శాతంగా ఉన్నది. సీఆర్డీఏ పరిధిలో ప్రస్తుతం ఉన్న పట్టణ ప్రాంతాల విస్తీర్ణం 155.52 చదరపు కిలోమీటర్లు కాగా కొత్తగా 1,463.91 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పట్టణ అవసరాల కోసం ప్రతిపాదించారు. ప రిశ్రమల కోసం 245.87 చదరపు కిలోమీటర్లు, అభివృద్ధి కారిడార్ కోసం 513.04 చదరపు కిలోమీటర్లు, మౌలిక వసతులకు సంబంధించి మల్టీ మో డల్ ఇంటీగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్, ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టు ఏరియా కలిపి 2.77 చదరపు కిలోమీటర్లు, నదులు, ద్వీపాలు,అడవుల కోసం 781.95 చదరపు కిలోమీటర్ల భూమిని కేటాయించారు.
అంతర్జాలంలో మాస్టర్‌ప్లాన్
మాస్టర్ప్లానలోనే జాతీయ రహదారులు, జిల్లా రోడ్డు, అవుటర్ రింగురోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు, రైల్వే లైన్లు, జాతీయ జలరవాణా మార్గాలను మార్కింగ్ చేశారు. ఇప్పటికే వీటిని అంతర్జాలంతో పాటు గుంటూరు, కృష్ణ కలెక్టర్ ఆఫీసులు, సీఆర్డీఏ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఇప్పటికే మాస్టర్‌ప్లానపై ప్రజలు తమ అభిప్రాయాలను ఈ-మెయిల్స్, లేఖల ద్వారా పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం అవగాహన సదస్సు నిర్వహించాల్సి ఉంది. తొలుత ఈ ప్లానపై రాజధానిలో సదస్సు నిర్వహించాలని భావించారు. అనివార్య కారణాలతో వేదికను మంగళవారం సాయంతం గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపానికి మార్చారు. సదస్సులో అందరి అభిప్రాయాలను సేకరిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. గ్రామ కమిటీలతో సమావేశం వాయిదా ఆంధ్రజ్యోతి, విజయవాడ : రాజధాని ప్రాంతంలోని గ్రామ కమిటీ సభ్యులకు రాజధాని నిర్మాణ మాస్టర్ ప్లాన్ అంశంపై అవగాహన కల్పించడానికి ప్రతిపాదించిన సమావేశం బుధవారానికి వాయిదా పడింది. ముందే నిర్ణయించిన ప్రణాళికల ప్రకారం సోమవారం రాజధాని గ్రామాల కమిటీ సభ్యులతో సీఆర్డీఏ ఉపాధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులు మంగళవారం సమావేశమై ఉండాల్సింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మెకెన్సీ రాజధాని నిర్మాణ అంశాలపై పవర్‌పాయంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా వేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం సీఆర్డీఏ స్థానిక అధికారులకు మాస్టర్ ప్లాన్‌పై శిక్షణ తరహా కార్యక్రమం నిర్వహించి అనంతరం వారి ద్వారా ఆయా రైతులకు అవగాహన కల్పించనున్నారు.