Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 6 2016 @ 03:17AM

షరీఫ్‌తో చాయ్‌... 7 ప్రాణాలు పోయాయ్‌

  • ప్రధానిపై శివసేన మండిపాటు 
న్యూఢిల్లీ/ముంబై, జనవరి 5: పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై బీజేపీ మిత్రపక్షం శివసేన ధ్వజమెత్తింది. ‘‘షరీ్‌ఫతో కప్పు చాయ్‌కి ఏడుగురు వీర సైనికుల ప్రాణాలు బలయ్యాయ్‌. ఆకస్మిక లాహోర్‌ పర్యటననాడే పాకిస్థాన్‌ను నమ్మొద్దని మేం చెప్పాం. మా మాటే నిజమై పాక్‌ నయవంచనకు పాల్పడింది. ఇకనైనా ప్రపంచాన్ని ఏకంచేసే ప్రయత్నాలు మాని, స్వదేశంపై దృష్టిపెట్టాలి’’ అని ‘సామ్నా’ సంపాదకీయంలో ని ప్పులు చెరిగింది. ‘‘మనం చేసిందల్లా అమరుల త్యాగాన్ని ట్విటర్‌లో కొనియాడుతూ సంతాపం తెలపడం ఒక్కటే’’నని ఎద్దేవా చేసింది. ఇక ‘ఫలితం కన్నా ప్రదర్శనే ముఖ్యం’ అన్నట్లు మోదీ విదేశాంగ విధానం తిరోగమన పథంలో పయనిస్తున్నదని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. త మ పాలనలో ఫలితాలపైనే దృష్టి సారిస్తే, మో దీకి ‘షో’ చేయడమే ప్రధానాంశమైందని పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ విమర్శించారు.