Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 6 2016 @ 01:43AM

కలల ప్రాజెక్టులో కలియదిరిగిన సీఎం

గణపురం (వరంగల్‌), జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి 600 మెగావాట్ల విద్యుదుత్పాదన ప్లాంట్‌ను మంగళవారం కేటీపీపీలో జాతికి అంకితంచేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్‌ జిల్లా చేల్పూరు వద్ద నిర్మించిన విద్యుత కేంద్రం ప్రాంగణంలో ఆయన హెలికాప్టర్‌ దిగారు. వెంటనే పైలానను ఆవిష్కరించి, ఆ ప్రాంతమంతా కలియదిరిగారు. అటుపైన సీఎం కంట్రోల్‌ రూంలో పరిశీలనకు వెళ్లినపుడు జెన్‌కో సీఎండీ ప్రభాకర రావు అక్కడి వ్యవస్థల గురించి వివరించారు. అదే సమయంలో ఎల్‌ఈడీ స్ర్కీనపై 621 మెగావాట్ల విద్యుత ఉత్పత్తి అయినట్లు చూపించడంతో పరవశంతో ఉప్పొంగిపోయారు. అతి తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్ర తొలి థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని తీర్చిదిద్దారంటూ ఈ సందర్భంగా సీఎండీతోపాటు డైరెక్టర్లు(ప్రాజెక్ట్స్‌) రాధాకృష్ణ, సచ్చిదానందం(ఫైనాన్స్‌), సీఈ లు అజయ్‌, శివకుమార్‌సహా ఇతర సిబ్బందిని సీఎం అభినందించారు.