Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 19:00PM

సీఎంకు అసలు జ్ఞానం ఉందా?: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి విపక్షాలు సూచనలు చేయడం లేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని టీ. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంకు అసలు జ్ఞానం ఉందా? అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అడ్డదారులు తొక్కుతోందన్నారు. జీహెచ్‌ఎంసీ, ఎన్నికల సంఘం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా, మరో నేత మర్రి శశిధర్‌రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారమే గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహించాలని.. నోటిఫికేషన్‌, ఎన్నికల మధ్య 21 రోజుల వ్యవధి ఉండాలని ఆయన కోరారు. గతంలో 45 రోజుల సమయం కావాలన్న ఎన్నికల సంఘం.. ఇప్పుడెందుకు స్పందించడం లేదని శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు.