Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 14:56PM

మగాళ్లే అయితే హడావుడి దేనికి?: రావుల

హైదరాబాద్‌, జనవరి (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో బలం లేకపోయినా.. అధికారాన్ని ప్రదర్శించి టీఆర్‌ఎస్‌ హడావుడి చేస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. ‘‘పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 24 అసెం బ్లీ సీట్లలో టీఆర్‌ఎస్‌ పార్టీకి కేవలం ఒక్కసీటే వచ్చింది. ఇంతలోనే ఆ పార్టీకి నగరం అంతా బలం పెరిగిపోయిందా? నిజంగా అంత బలం ఉండి... అంత మగాళ్లు అయితే ఎన్నికల నోటిఫికేషనకు ముందే స్కైవేల పేరుతో శంఖుస్థాపనలు ఎందుకు’’ అని ప్రశ్నించారు. గ్రేటర్‌లో ప్రజాబలం లేని టీఆర్‌ఎస్‌.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.