Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 14:54PM

బీజేపీకి55.. మనకు 95.. రంగంలోకి చంద్రబాబు!

 గ్రేటర్‌ స్థానాల్లో పోటీపై టీడీపీ యోచన
హైదరాబాద్‌, జనవరి (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీకి 55 డివిజన్లను కేటాయిం చి.. మిగిలిన 95 డివిజన్లలో పోటీచేయాలని టీడీపీ నేతలు ప్రతిపాదించినట్టు తెలిసింది. గ్రేటర్‌ హైదరాబా ద్‌లోని మొత్తం 150 డివిజన్లలో సగానికి మించి సీట్లను కేటాయించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తుం డగా.. తాము గెలిచేసీట్లను వదులుకునేది లేదని టీడీపీ స్పష్టం చేస్తున్నట్టు తెలిసింది. 2009లో జరిగిన గ్రేటర్‌ కార్పొరేషన ఎన్నికల్లో బీజేపీ 5డివిజన్లలో విజయం సాధించగా.. టీడీపీ 45 డివిజన్లను కైవసం చేసు కుంది. గతంలో బీజేపీ గెలిచిన స్థానాలను మళ్లీ వారికే కేటాయించడం మిత్రధర్మమని.. అదే విధంగా తాము విజయం సాధించిన 45 డివిజన్లలో ఎలాంటి అభ్యంతరాలుండవని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ 50 సీట్లూ పోనూ... మిగిలిన వంద డివిజన్లలో చెరిసగం అంటే 50 సీట్లలో టీడీపీ, మరో 50 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులకు కేటాయించాలని తెలుగు దేశం నేతలు ప్రతిపాదించినట్టు సమాచారం. దీంతో తమకు 95 సీట్లలో పోటీ చేసే అవకాశం లభిస్తుందని ఆపార్టీ నేతలు పూర్తి భరోసాతో ఉన్నారు. గతంలో కాంగ్రెస్‌, మజ్లిస్‌ అభ్యర్థులు గెలిచిన స్థానాల్లో క్షేత్రస్థాయి బలాబలాలను పరిశీలించి బీజేపీ, టీడీపీల మధ్య పొత్తుల ను ఖరారు చేయాలని వారు అంటున్నారు. పాతనగరంలో మజ్లిస్‌ గెలిచిన 43 స్థానాల్లో పోటీ చేయడానికి బీజేపీ నేతలు సిద్ధమైన పక్షంలో ఆ మేరకు.. కేటాయించడానికి అభ్యంతరం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా టీడీపీ-బీజేపీలు ఏయే డివిజన నుంచి పోటీ చేయాలో ఇరు పార్టీలకు చెందిన సీనియర్‌లతో ఏర్పాటైన కమిటీ ఖరారు చేస్తుందని, గ్రేటర్‌ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత పొత్తులపై సంప్రదింపులు ప్రారంభమవుతాయని సీనియర్లు పేర్కొంటున్నారు.

 
రంగంలోకి చంద్రబాబు!
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల రంగంలోకి.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు దిగనున్నారు. జనవరి నెలాఖరులో గ్రేటర్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వారంలో ఒక రోజు ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తల సదస్సును భారీగా నిర్వహించాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. పది పదిహేను వేల మంది కార్యకర్తలు పాల్గొనేలా నిజాం మైదానంలో.. ఈ నెల 7 లేదా 9 తేదీల్లో ఏదో ఒక రోజు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఏడో తేదీన ఈ సభ ఖరారు కావడానికి అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలోకి చంద్రబాబును కూడా తీసుకొనిరావాలని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆయన ప్రచారం చేస్తే పోయిన అసెంబ్లీ ఎన్నికలనాటి ఫలితాలు వస్తాయని పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ఎన్నికల తేదీ వచ్చిన తర్వాత చంద్రబాబు పర్యటన ఖరారు చేయించాలన్న అభిప్రాయంలో నేతలు ఉన్నారు.