Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 13:19PM

జలాలాబాద్‌లో భారత దౌత్య కార్యాలయంపై ఉగ్ర దాడి

జలాలాబాద్ : తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయంపై మంగళవారం ఉగ్రవాద దాడి జరిగినట్లు ఆఫ్ఘన్ మీడియా పేర్కొంది. ఈ ప్రాంతంలోనే పాకిస్థాన్, ఇరాన్ దౌత్య కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ దాడిలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లోని మజారే షరీఫ్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయంపై ఆదివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే.