Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 10:54AM

బాలీవుడ్ హిట్ మూవీపై అక్కినేని హీరో కన్ను..

మనం సినిమాతో గెస్ట్ అపిరయెన్స్ ఇచ్చి అదరగొట్టిన అఖిల్.. ఫుల్ లెంగ్త్ హీరోగా మ్యాజిక్ చూపించలేకపోయాడు... భారీ అంచనాలతో విడుదలయిన ఈ అక్కినేని యంగ్ హీరో మూవీ అఖిల్.. టాలీవుడ్ ఆడియెన్స్‌ను అనుకున్న రీతిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని తండ్రి నాగార్జునతో పాటు హీరో అఖిల్ కూడా ఫిక్స్ అయ్యాడు... అందుకే వెంటనే సెకండ్ సినిమాకు కమిట్ అవ్వకుండా.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు... ఈ నేపథ్యంలో ఈ కుర్రహీరో.. బాలీవుడ్ హిట్ మూవీ 'యే జవానీ హై దివానీ' ని టాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వినిపిస్తోంది...
 
రణ్ బీర్ కపూర్- దీపికా పదుకొనే కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'యే జవానీ హై దివానీ' బాలీవుడ్ ప్రేక్షకులను బాగా అలరించింది... ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడట అఖిల్... ఈ విషయం గురించి నిర్మాత కరణ్ జోహార్‌తో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే రీమేక్ రైట్స్ ఇచ్చేందుకు ఇష్టపడని కరణ్.. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలసి అఖిల్ అప్ కమింగ్ సినిమాను నిర్మించేందుకు సరే అన్నాడట... ఈ బాలీవుడ్ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు- చేర్పులు చేయనున్నారట. ఏదేమైనా ఫస్ట్ మూవీతో హిట్ కొట్టలేక పోయిన అఖిల్.. రెండో సినిమాతో అటు అమ్మాయిల మనసు దోచుకోవడంతో పాటు విజయాన్ని చేజిక్కించుకుంటాడేమో చూడాలి...