desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 09:58AM

భర్తను కిరోసిన్ పోసి చంపింది.. నేడు జైలు పాలైంది

బెంగళూరు/ హోసూరు : బేరికైలో భర్తకు నిప్పంటించి సజీవ దహనం చేసిన భార్యకు కోర్టు జైలు శిక్ష విధించింది. బేరికైలోని అమ్మన్‌ నగర్‌కు చెందిన అబ్దుల్‌ రషీద్‌ భార్య అయిషా (32). భార్యా భర్తలు తరచూ గొడవ పడేవారు.  గత 2012 ఫిబ్రవరి 5న వీరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. తీవ్రంగా ఆగ్రహించిన అయిషా వంటింట్లోని కిరోసినను తీసుకొచ్చి.. తన భర్తపై పోసి నిప్పటించింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అబ్దుల్‌ రషీద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయంపై కోర్టులో వాదోపవాదాలు విన్న జడ్జి సంపత్‌.. నిందితురాలికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు నిచ్చారు.