Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 08:39AM

ఐదోసారి తెరపైకి మమ్ముట్టి, రాయ్ లక్ష్మీ

సోలోగా సక్సెస్‌లు లేకపోయినా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పాపులర్‌ హీరోయిన్‌గా ఎదిగింది రాయ్‌లక్ష్మీ. తమిళంలో మల్టీస్టారర్‌ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆమె ఇతర భాషలపైనా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఛాన్స్ దక్కించుకుంది. తాజాగా మాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మమ్ముట్టికి జోడీగా ఐదోసారి అవకాశం సంపాదించింది. మలయాళ అగ్ర దర్శకుడు రెంజి పానికర్‌ వారసుడు నితిన్ రెంజి పానికర్‌ దర్శకత్వం వహించనున్న తొలి చిత్రంలో మమ్ముట్టి, రాయ్‌లక్ష్మీ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ ‘అన్నన్ తంబి’, ‘చట్టంబినదు’, ‘పరుందు’, ‘రాజాధిరాజా’ చిత్రాల్లో నటించారు. యాక్షన్ డ్రామా సబ్జెక్టుతో నితిన్ తెరకెక్కించనున్న చిత్రంలో మమ్ముట్టి పోలీసు ఆఫీసర్‌గా నటించనుండగా, రాయ్‌లక్ష్మీ నెగిటివ్‌ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తమిళ దర్శకుడు రామ్‌ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రంలో మమ్ముట్టి, అంజలి జంటగా నటించనున్నారు.