Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 06:04AM

ఏసీ ప్రత్యేక డబుల్‌ డెక్కర్‌ సర్వీసుల పొడిగింపు

గుంటూరు, ఆంధ్రజ్యోతి: సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా కాచిగూడ-గుంటూరు మధ్యన మరికొన్ని ఏసీ డబుల్‌ డెక్కర్‌ రైల్‌ సర్వీసులను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. నెంబర్‌ 02122 కాచిగూడ-గుంటూరు డబుల్‌ డెక్కర్‌ ఈ నెల 16, 18 తేదీల్లో ఉదయం 9.55 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు గుంటూరు చేరుకొంటుంది. అలానే నెంబర్‌ 02121 గుంటూరు - కాచిగూడ డబుల్‌ డెక్కర్‌ ప్రత్యేక రైలు ఈ నెల 17, 19 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 5.25 గంటలకు కాచిగూడ చేరుకొంటుంది. అలానే నెంబర్‌ 02124 కాచిగూడ-గుంటూరు డబుల్‌ డెక్కర్‌ రైలు ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు గుంటూరు చేరుకొంటుంది. నెంబర్‌ 02123 గుంటూరు - కాచిగూడ డబుల్‌ డెక్కర్‌ ఈ నెల 18వ తేదీన రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 5.25 గంటలకు కాచిగూడ చేరుకొంటుంది. ఈ రైళ్లకు మంగళవారం ఉదయం నుంచి రిజర్వేషన ప్రారంభిస్తున్నట్లు సీనియర్‌ డీసీఎం కే ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.