Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 03:48AM

వడ్డీ వ్యాపారులపై పోలీస్‌ కొరడా!

  • పాతబస్తీలో 56 మంది అరెస్ట్‌
 
చార్మినార్‌, జనవరి 4: బారు వడ్డీలు.. చక్ర వడ్డీలు.. ప్రజల నరం తెంచుతున్న భారమైన వడ్డీలు! ఆ వడ్డీల చట్రంలో చిక్కుకుని వేదన అనుభవించిన వంద మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వ్యాపారులపై పోలీసులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్‌లోని నాలుగు డివిజన్లలో 25 బృందాలుగా ఏర్పడి దాడులుచేశారు. మొత్తం 56 మందిని అరెస్ట్‌ చేశారు. సోమవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్‌ డీసీపీ కె.బాబురావుతో కలిసి సౌతజోన్‌ డీసీపీ వి.సత్యనారా యణ వివరాలు వెల్లడించారు. 20 నుంచి 40 శాతం వడ్డీతో వ్యాపారులు జనాల నడ్డి విరుస్తున్నారని చెప్పారు. తీర్చడం ఆలస్యమైతే అప్పు తీసుకున్నవారి ప్లాట్లు, ఇళ్ళు, వాహనాలు, జీపీఏ, ఎస్‌పీఏ రాయించుకుంటున్నారని చెప్పారు. ఇటీవల ఓ వడ్డీ వ్యాపారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే.. సదరు వడ్డీ వ్యాపారి పోలీసులు తనను అనవసరంగా హింసిస్తున్నారని మీడియాను ఆశ్రయించటమేకాకుండా మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడన్నారు. కాగా, పాతబస్తీలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు 270 మంది వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదుచేసి వారిపై క్రిమినల్‌, చీటింగ్‌, మనీలాండరింగ్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నలుగురిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశామన్నారు. మరో 40 మందిపై పీడీ యాక్ట్‌ ప్రతిపాదనలు పంపామన్నారు. ఇకపై పాతబస్తీలో తరుచుగా దాడులు నిర్వహించి వడ్డీ వ్యాపారు లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. వడ్డీ వ్యాపారులు ఆగడాలపై.. డీసీపీ వి.సత్యనారాయణ (9490616476), ఫలక్‌నుమా ఏసీపీ ఎం.ఎ బారీ (9490616158), సంతోష్‌నగర్‌ ఏసీపీ శ్రీనివాసులు (9490616533), చార్మినార్‌ ఏసీపీ అశోక్‌ చక్రవర్తి (9490616477), మీర్‌చౌక్‌ ఏసీపీ శ్రీనివాసులు (9490616515)కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.