desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 03:09AM

ముంబై ముష్కరుల కంటే సుశిక్షితులు

  • రెండు బృందాలుగా స్థావరంలోకి చొరబాటు
  • ఎస్పీ కిడ్నాప్‌కు ముందే వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు
  • ఎస్పీ వాహనంలో నేరుగా వచ్చిన నలుగురు
  • లక్ష్యాన్ని చేరడంలో ఎందుకు వెనకబడ్డారు!?
  • నలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సూత్రధారులు
  • ప్రాణ నష్టం నివారించండి.. అనవసర రిస్కులొద్దు
  • ప్రధాని మోదీ, రక్షణ మంత్రి పర్రీకర్‌ ఆదేశాలు
  • కనీసం ఒకరినైనా సజీవంగా పట్టుకోవాలనే పట్టుదల
  • ఆపరేషన్ ఆలస్యానికి కారణాలు ఇవే
పఠాన్ కోట్‌, జనవరి 4: ఉగ్రవాదులు రెండు బృందాలుగా పఠానకోట్‌ వైమానిక స్థావరంలోకి చొరబడ్డారా!? మొదటి బృందంలోని ఇద్దరూ అందరికంటే ముందే.. సైనికులు అప్రమత్తం కావడానికి ముందే.. ఇంకా చెప్పాలంటే ఎస్పీని కిడ్నాప్‌ చేయడానికి ముందే స్థావరంలోకి చేరుకున్నారా!? అక్కడి రెండంతస్తుల మేడలో తలదాచుకున్నారా!? ఆ తర్వాత ఎస్పీని కిడ్నాప్‌ చేసి ఆయన కారులోనే నలుగురు ఉగ్రవాదులు నేరుగా వైమానిక స్థావరంలోకి ప్రవేశించారా!? ఈ ప్రశ్నలన్నిటికీ ‘ఔను’ అనే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎనఐఏ) అఽదికార వర్గాలు. ఎస్పీ సల్వీందర్‌ సిగ్‌తోపాటు కిడ్నాప్‌ అరుున ఆయున విుత్రుడు రాజేశ వర్మను ఎనఐఏ విచారించినప్పుడు.. ఉగ్రవాదులు పాకిస్థానలోని సూతధరులతో వూట్లాడిన ఫోనను నిఘావ్గాలు అడ్డగించి విన్నప్పుడు ఈ విషకుం సుస్పష్టవెుౖంది. అత్యంత విశ్వసనీయు వర్గాల కథనం ప్రకారం.. ఎీస్ప సల్వీందర్‌ తదితరులను కిడ్నా్‌ప చేిసనప్పుడు రాజేశ ఫోనతో ఉగ్రవాదులు పాకిస్థానలోని సూత్రదారుతో వూట్లాడారు. అపు్పడు.. ‘‘విుగిలిన ఇద్దరూ ఇప్పటికే వైవూనిక స్థావరానికి చేరుకుంటే మీెందుకు వెనకబడ్డారు?’’ అని సూత్రధారులు నిలదీశారు. దాంతో, పోలీసు ిపకెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయ, అందుకే ఆలస్య వెుౖందని జవాబిచ్చారు. శుక్రవారం ఉదయూనికే వాళ్లు వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఉగ్రవాదులంతా సైనికుల దుస్తుల్లో ఉండడం.. ఎస్పీ వాహనంలో రావడంతో ఎవరూ అనుమానించలేదు.
 
సుశిక్షిత సైనికుల్లా దాడి
పఠానకోట్‌ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులు సుశిక్షిత సైనికుల్లా వ్యవహరించారని, వ్యూహాలను కూడా ప్రొఫెషనల్‌గా అమలుచేశారని భద్రతా దళాలు వివరిస్తున్నాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ముంబై ముష్కరుల కంటే మెరుగైన శిక్షణ పొంది వచ్చారని వివరించాయి. వైమానిక స్థావరానికి భారీగా నష్టం చేకూర్చాలనే లక్ష్యం తో.. పేలుడు పదార్థాలు, తుపాకులు, రాకెట్‌ లాంఛర్లతో ఉగ్రవాదులు స్థావరంలోకి చొరబడ్డారు. ‘‘తుపాకీ గుళ్లను పొదుపుగా వాడుతూ.. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో కాల్పు లు జరుపుతూ ఉదయం గమ్మునుంటున్నారు. తద్వారా, ఉగ్రవాదులంతా చనిపోయారనే అభిప్రాయం కలగజేస్తున్నారు.’’ అని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
 
ఎస్పీ కారణంగానే..
ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసిన ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ గత చరిత్ర కారణంగానే ఆపరేషన్ మొదలు పెట్టడం ఆలస్యమైందని, మూడు రోజులపాటు కొనసాగడానికి కారణం కూడా ఇదేనని వివరిస్తున్నారు. ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ గతంలో గురుదాస్‌పూర్‌లో పనిచేశారు. అక్కడ గతంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఆయన క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఎస్పీ మాటల్లో నిజమెంతో తేల్చుకోవడానికే కీలకమైన సమయం అంతా వృథా అయిపోయిందన్నారు.

3 రోజుల దాడి వెనక మర్మం!
పఠాన్ కోట్‌ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతా దళాలకు ఏకంగా మూడు రోజులు పట్టింది. నలుగురిని శనివారమే హతమార్చగా.. ఇద్దరిని చంపడానికి రెండు రోజులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇందుకు కారణాలనూ భద్రతా బలగాలు వివరిస్తున్నాయి. ‘ప్రాణ నష్టాన్ని నివారించండి. అనవసర రిస్కులు తీసుకోవద్దు’ అని ప్రధాని మోదీ, రక్షణ మంత్రి మనోహర్‌ పర్రీకర్‌ ఆదేశించారు. దీనికితోడు, వీలయితే కనీసం ఒక ఉగ్రవాదిని అయినా సజీవంగా పట్టుకోవాలని భద్రతా బలగాలు భావించాయి. అందుకే ఆపరేషన్ మూడు రోజులు పట్టింది. ఇక, ఎదురు కాల్పుల్లో ఏడుగురు జవాన్లు చనిపోవడంపైనా వివరణ ఇస్తున్నాయి. ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు సైనికుల విశ్రాంతి గృహంపై దాడి చేశారని, ఆ సమయంలో డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్‌ సైనికులు షిఫ్టు మారుతున్నారని, దాంతో అక్కడికక్కడే ఐదుగురు చనిపోయారని వివరిస్తున్నారు. ఒక ఉగ్రవాదిని కాల్చి చంపిన తర్వాతే వారిలో ఒక సైనికుడు మరణించాడని తెలిపారు. ఎదురు కాల్పుల్లో గరుడ కమెండో చనిపోయారని, లెఫ్టినెంట్‌ కల్నల్‌ నిరంజన్ చనిపోవడం పూర్తిగా దురదృష్టమని వివరించారు. అయితే, ఉగ్రవాదుల వ్యూహాన్ని మాత్రం చిత్తు చేశామని స్పష్టం చేస్తున్నారు.