Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 02:23AM

జోకులేస్తే సర్దార్జీలు ఫీలవుతారా?

  • అయితే మేం పరిగణనలోకి తీసుకుంటాం: సుప్రీం 
  • సిక్కు మహిళా న్యాయవాది ప్రజాహిత వ్యాజ్యం 
  • డీఎస్‌జీఎంసీ పిటిషన్‌తో విచారిస్తామన్న ధర్మాసనం
 
న్యూఢిల్లీ, జనవరి 4: సర్దార్జీ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది వారిపై వెబ్‌సైట్లలో కనిపించే జోకులే! సర్దార్జీలు సైతం తమ మీద తామే జోకులు వేసుకునేంత సెన్సాఫ్‌ హ్యూమర్‌ గలవారు. అయితే.. అవి తమ వర్గానికి అవమానం కలిగించే రీతిలో ఉంటున్నాయని, కాబట్టి వెబ్‌సైట్లలో ఉన్న శాంటా బాంటా తరహా సర్దార్జీ జోకులన్నిటినీ తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓ సిక్కు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ జోకుల కారణంగా తమ పిల్లలు పేరు వెనక సింగ్‌, కౌర్‌ అని పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదని ఆవేదన వెలిబుచ్చారు. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు సిక్కులు నిజంగానే అలా భావిస్తే గనక ఈ కేసును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. హర్వీందర్‌ చౌదరి అనే న్యాయవాది దాఖలు చేసిన ఈ ప్రజాహిత వ్యాజ్యం.. సుప్రీం సీజే టీఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఆర్‌.భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక జోకు సిక్కులకు ఎలా అవమానకరమైందో ఎవరు నిర్ణయిస్తారని న్యాయవాది హర్వీందర్‌ను అడిగారు.
 
‘‘ఈ పిల్‌ విషయంలో మీ సామాజికవర్గం మీ వెనక ఉంటుందా’’ అని ఆమెను ప్రశ్నించారు. అందుకు ఆమె స్పందిస్తూ.. ఢిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ సంఘం (డీఎస్‌జీఎంసీ) కూడా ఈ విషయమై ఒక పిటిషన్‌ను దాఖలు చేసినట్లు చెప్పారు. ఆ కేసును వాదించేందుకు డీఎ్‌సజీఎంసీ రామ్‌జెఠ్మలానీ వంటి ప్రముఖ లాయర్లను నియమించుకున్న విషయాన్ని తెలిపారు. కేసుకు సంబంధించి ఆమె తన వాదనలు వినిపిస్తుండగా జోక్యం చేసుకున్న ధర్మాసనం.. అక్కడే ఉన్న అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పీఎస్‌ పట్వాలియాను ఉద్దేశించి ‘ఒక సర్దార్జీగా దీనిపై మీ అభిప్రాయమేమిటి’ అని ప్రశ్నించారు. ఆయన తన అభిప్రాయం చెప్పేలోపే హర్వీందర్‌ మళ్లీ తన వాదన మొదలుపెట్టారు. అయితే, ప్రొసీడింగ్స్‌ చివరిలో.. పట్వాలియా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో.. డీఎ్‌సజీఎంసీ పిటిషన్‌తో కలిపి ఈ కేసును విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. అయినా ఆమె తన వాదనలు వినిపిస్తుండగా మధ్యలోనే ఆపి తదుపరి విచారణ సమయంలో వాదనలు వినిపించాలని చెప్పారు.