Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 5 2016 @ 02:09AM

రీయింబర్స్‌ దరఖాస్తుకు నేడే ఆఖరు

  • రెండేళ్ల కాలానికి 5,080 కోట్లు కావాలి
  • ఇచ్చింది 1050కోట్లు.. ఇచ్చేది 600 కోట్లు
  • 2016-17 బకాయి 3,430 కోట్లు!
 
 
హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు మంగళవారం ముగియనుంది. ఈ మేరకు 2014-15కుగాను తాజా, నవీకరణ (రెన్యువల్‌) కింద 13,82,824 మంది, 2015-16కుగాను 13,50,319మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2014-15 పద్దుకింద ఫీజుల కోసం రూ.2540 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం రూ.1050 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో 8 జిల్లాల్లో చెల్లింపులు పూర్తికాగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వారంనుంచీ విడుదల చేస్తున్నారు. అయితే చెల్లింపులు సక్రమంగా లేనందున నిధులివ్వాలని బీసీ, ఎస్సీ సంక్షే మశాఖలు లేఖ రాయగా నెలకు రూ.200 కోట్ల వంతున మాత్రమే ఇస్తామని ఆర్థిక శాఖ మౌఖికంగా తెలిపింది. ఈ లెక్క ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుండటం తో రూ.600 కోట్లు మాత్రమే విడుదలవు తాయి. తెలంగాణ ఏర్పడేనాటికిగల బకాయిలను ప్రభుత్వం తీర్చేసినా, రెండేళ్ల బకాయిలు పెండింగ్‌లో పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద 2014-15, 2015-16కు కలిపి రూ.5080 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1050 కోట్లు ఇవ్వగా, ప్రభుత్వం మూడు నెలల్లో రూ.600 కోట్లు విడు దల చేయనుంది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17) రూ.3430 బకాయిలు పెండింగ్‌లో పడతాయి. మరోవైపు 2015-16 దరఖాస్తుల పరిశీలన ఇంకా ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల నడుమ ఫీజుల నిధుల విడుదల కోసం కాలేజీ యాజమాన్యాల తోపాటు విద్యార్థులు ప్రభు త్వానికి మొరపెట్టుకుంటున్నారు.