Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 4 2016 @ 21:30PM

‘మా కూటమిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా’

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. మల్కాజ్‌గిరిలో బీజేపీ-టీడీపీ  ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లడుతూ కేంద్రానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనని దేశ అభివృద్ధే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సభలో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.