Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 02:57AM

ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి



పార్వతీపురం టౌన్‌ :ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకో వాలని పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీ వులు అన్నారు. వాసవీ, గాయత్రి విద్యా సంస్థ ల అధినేత పీవీకే మణికుమార్‌ ఆధ్వర్యంలో రె డ్డీస్‌ ఫార్మా సూటికల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వా రు నిర్వహించిన జాబ్‌ మేళాలో ఎంపికైన వా రికి ఆదివారం ఎమ్మెల్యే నియామక ఉత్తర్వుల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం, నిరుద్యోగులైన 76 మందికి రెడ్డీస్‌ కంపెనీ వా రు ఉపాధి కల్పించడం గర్వించదగ్గ విషయ మన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డీస్‌ ప్ర తినిధులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నిరుద్యో గ యువతతో పాటు మహిళా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఓ పక్క ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మరో ప క్క ఉన్నత విద్య చదువుకొనే వెసులుబాటును కల్పించడం అరుదైన విషయమని, ఇలాంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకో వాలని ఎమ్మెల్యే సూచించారు. క్రమశిక్షణతో మెలగి మన ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీ సుకురావాలని ఎంపికైన అభ్యర్థులకు తెలిపి 76 మందికి నియామక ధ్రువపత్రాలు అంద జేశారు.
పార్వతీపురంలో జాబ్‌ మేళాను ఏర్పా టు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశా లు కల్పించేలా కృషి చే సిన వాసవీ, గాయత్రి కళాశాలల చైర్మన్‌ పీవీకే మణికుమార్‌ను అ భినందించారు.