Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 15 2014 @ 02:57AM

పింఛన్లలో మాయాజాలం

(విజయనగరం, ఆంధ్రజ్యోతి)
సామాజిక పింఛన్ల మంజూరులో అవ తవకలకు తావులేదు. ఇందులో పారదర్శక తకే పెద్దపీట. అన్ని అర్హతలుండి, వాటికి సంబంధించిన ధ్రువపత్రాలు అందజేస్తేనే పింఛను మంజూరవుతుంది. ఇందులో అనుమానాలు, అపోహలకు తావులేదు.
- జిల్లా అధికారులు
తరచూ చెబుతున్న మాట.

వితంతువులైతే భర్త చనిపోయినట్టుగా మరణ ధ్రువపత్రం, వికలాంగులైతే అంగ వైకల్యం కలిగినవారిగా వైద్యుడి ధ్రువప త్రం అందజేయాల్సిందే. అలా చేయని వారి దరఖాస్తులను వెంటనే తిరస్కరి స్తున్నాం. ఆ పత్రాలు లేనివారికి పింఛను మంజూరైతే కచ్చితంగా అది బోగస్సే.
- మండల స్థాయి
అధికారులు ఉద్ఘాటన
ఆ గ్రామంలో 138 వితంతు పిం ఛనుదారులకుగాను భర్త మృతిచెందిన ట్టుగా సర్టిఫికేట్‌ అందజేసింది కేవలం 11 మంది మాత్రమే. అంతవరకు మాత్రమే చెప్పగలం. ఏం జరిగిందో మాకైతే తెలీదు.
- ఆర్టీఐ కింద అధికారులిచ్చిన సమాచారం.
అవసరమైన ధ్రువపత్రాలన్నింటిని స మర్పించినా అర్హులకు పింఛను మంజూ రు చేసేందుకు మూడు చెరువుల నీళ్లు తా గించి, నెలల పాటు తిప్పించుకుని చివర కు మొండిచేయి చూపుతున్న ఈ రోజుల్లో అసలు ఎటువంటి ఆధారం జతపరచకుం డానే వందలాది పింఛన్లు మంజూరు చే సేసిన విషయం వెల్లడైంది. రూ.30 లక్ష ల రూపాయల ఇందిరమ్మ ఇళ్ల కుంభ కోణం ఆరోపణలతో కుతకుతలాడుతు న్న గుర్ల మండలం గరికివలస గ్రామంలో బయటపడ్డ ఈ బాగోతం మరోసారి ఆ గ్రామ పెద్దల ఇష్టారా జ్యాన్ని, అధికారుల నిర్వాకాన్ని చాటి చెబు తోంది.
గరికివలస గ్రామంలో 138 మంది వితంతు పింఛను లబ్ధిదారులున్నారు. వీరిలో ఎంతమం ది తమ భర్తల డెత్‌ సర్టిఫికెట్లు దరఖాస్తు స మయంలో జతచేశారనే వివరాల కోసం తాజా గా ఎంపీడీవోకు సమాచార హక్కు చట్టం కిం ద దరఖాస్తు చేయగా, దీనిపై అటు నుంచి వ చ్చిన సమాచారం అందరినీ విస్తుపోయేలా చే సింది. ఈ 138 మందిలో 106 మంది తమ భ ర్తల డెత్‌ సర్టిఫికెట్‌ జత చేయలేదని తేలింది. 11 మంది లబ్ధిదారులు మాత్రమే ఈ ధ్రువప త్రాన్ని జత చేశారని, మరో 12 మంది భర్తల పేర్లు పంచాయతీలోని మరణ రికార్డుల్లో నమోదై ఉన్నాయని, 9 మంది పేర్లు సామా జిక తనిఖీ పత్రంలో నమోదై ఉన్నాయని పౌ రసమాచార అధికారి హోదాలో ఎంపీడీవో నుంచి రాతపూర్వకంగా సమాచారం అందింది. డెత్‌ సర్టిఫికెట్‌ జత చేయనిపక్షంలో దరఖాస్తు వైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు.. ఈ 106 మంది ఆ ధ్రుపపత్రాన్ని జతచేయకున్నా వారికి ఎలా పింఛన్లు మంజూరు చేశారనేది అంతు బట్టడంలేదు. ఇక వికలాంగ పింఛన్ల సంగతి కొస్తే.. ఈ గ్రామంలో 67 మంది ఈ పింఛన్లు పొందుతున్నారు. వీరిలో ఒక్కరి అం గవైకల్య ధ్రువపత్రం కూడా తమ కార్యాల యంలో లభ్యత లేదని సదరు పౌరసమాచార అధికారి పేర్కొన్నారు. డెత్‌ సర్టిఫికెటు జతచే యని వితంతు పింఛను లబ్ధిదారుల్లో అతి కొద్దిమంది మాత్రమే అర్హులున్నట్టు, మిగిలిన వారంతా అనర్హులని, మేనేజ్‌ చేసుకున్నారని తాజా పరిస్థితులు బయట పెడుతున్నాయి. వికలాంగ పింఛనుదారుల విషయంలో కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎంతటివా రైనా వైద్యుడి అంగవైకల్య ధ్రువపత్రం అం దజేయనిదే పింఛను మంజూరు జరగదని ప లుమార్లు ప్రకటించే అధికారులు.. సర్టిఫికెట్‌ లేకుండా 67 మందికి ఎలా పింఛన్లు మంజూ రుచేశారో వారికే తెలియాలనే విమర్శలు విని పిస్తున్నాయి. దీనిపై అక్కడి అధికారులను అ డిగితే.. అప్పట్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ చూపిస్తే పింఛను మంజూరు చేసి ఉంటారని చెబుతు న్నారు. అంతకుమించి కొత్తగా బాధ్యతలు చేపట్టిన తమకు వివరాలు తెలియవని పే ర్కొంటున్నారు. జెరాక్స్‌ జతచేయకుండా ఒరిజ నల్‌ చూపించేస్తే పింఛను మంజూరుచేసి ఉం డొచ్చని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన గ్రామాలకు లేని మినహాయింపు గ రికివలసకే ఎందుకు ఇచ్చారనే ప్రశ్నకు అధికా రుల వద్ద ఏం సమాధానం ఉందో వారికే తె లియాలి. నాటి అధికారులు అప్పటి పాలకుల ఒత్తిడి వల్లనో మరే కారణం వల్లనే నిబంధన లకు పాతరేసి మరీ పింఛన్లు మంజూరు చే సినట్టుగా భావిస్తున్నారు. ఈ విషయం సోమ వారం జరిగే గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ ఎంఎం నాయ క్‌ దృష్టికి తీసుకువెళ్లేందుకు గ్రామస్థుడు గొ ల్లపూడి సత్యనారాయణ మూర్తి సిద్ధమవు తున్నారు. మొత్తమ్మీద.. వరుస వివాదాలతో చ ర్చనీయాంశమైన గరికివలసలో తాజా వివా దం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కలెక్ట ర్‌కు ఫిర్యాదు ఇవ్వనున్న నేపథ్యంలో ఈ వి తంతు, వికలాంగ పింఛన్ల వ్యవహారంలో మ రిన్ని సంగతులు బయటపడే అవకాశమున్న ట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.