Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 4 2016 @ 06:38AM

ముత్యాలముగ్గులు

నరసరావుపేట: పట్టణంలోని జమీందార్‌ ఫంక్షన్‌ ఫ్లాజాలో యర్రంశెట్టి మోటార్స్‌ సౌజన్యంతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీకి మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. పోటాపోటీగా రంగవ ల్లులను తీర్చిదిద్దారు. మహిళల్లో దాగి వున్న సృజనాత్మకతను రంగ వల్లుల ద్వారా వెలికి తీశారు. సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పుతూ ఆకట్టుకొనేలా రంగ వల్లులు తీర్చిదిద్దారు. పదేళ్ళ బాలిక నుంచి 75 ఏళ్ళ వృద్ధురాలు వరకు 80 మంది మహిళలు ఉల్లాసంగా పోటీలో పాల్గొన్నారు. సంక్రాంతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ముగ్గులను తీర్చిదిద్దారు. పోటీలను గత ఏడేళ్లుగా యర్రంశెట్టి మోటార్స్‌ అధినేతలు యర్రంశెట్టి రాము, యర్రంశెట్టి హనుమంతరావు పోటీలను స్పాన్సర్‌ చేయటం విశేషం. చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి మహిళలు ముగ్గులు వేసేందుకు తరలి వచ్చారు.
విజేతలు వీరే...
యర్రంశెట్టి మోటార్స్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతిని పట్టణానికి చెందిన రామిశెట్టి విజయ గెలుపొందారు. ద్వి తీయ బహుమతిని పట్టణానికి చెందిన బీ స్రవంతి, తృతీయ బహుమతిని ఎం నాగజ్యోతి గెలుచుకున్నారు. కన్సోలేషన్‌ బహుమతులను చిలకలూరిపేటకు చెం దిన కే శ్రీలక్ష్మి, టీ విజయలక్ష్మిలు గెలుపొందారు. ప్రథమ బహుమతికి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.3వేలు, తృతీయ బహుమతి రూ 2వేలు, కన్సోలేషన్‌ బ హుమతి రూ.వెయ్యి నగదును అందజేశారు. పోటీల అనంతరం జమీందార్‌ ఫం క్షన్‌ ఫ్లాజాలో జరిగిన సభలో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిని రామిశెట్టి విజయకు యర్రంశెట్టి మోటార్స్‌ అధినేతలు యర్రంశెట్టి రాము, హనుమంతరావు, హీరో సంస్థ ప్రతినిధులు కే సుబ్రహ్మణ్యం, శశికుమా ర్‌ అందజేశారు. ద్వితీయ బహుమతిని బీ స్రవంతికి యర్రంశెట్టి రాము, తృతీ య బహుతిని ఎం.నాగజ్యోతికి యర్రంశెట్టి హనుమంతరావు, కన్సోలేషన్‌ బ హుమతులు కే శ్రీలక్ష్మికి యర్రంశెట్టి అనురాధ, టీ విజయలక్ష్మికి యర్రంశెట్టి శకుంతల పంపిణీ చేశారు. పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న 75 ఏళ్ళకు పైబడిన వృద్ధురాలు కే వెంకటసుబ్బమ్మకు హీరో సంస్థ సేల్స్‌ మేనేజర్‌ కే సుబ్రహ్మణ్యం, సర్వీస్‌ మేనేజర్‌ శశికుమార్‌ రూ వెయ్యి నగదును బహుమతిగా అందజేశారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్‌ కంకణంపాటి భారతీదేవి, న్యాయవాది కొత్త భవా నీ, ఉపాధ్యాయురాలు టీ విజయలక్ష్మి వ్యవహరించారు.